Nidhan
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఓ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్ నాశనమవడానికి మాహీయే కారణమన్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఓ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్ నాశనమవడానికి మాహీయే కారణమన్నాడు.
Nidhan
క్రికెట్లో కొందరు ఆటగాళ్లు కచ్చితంగా స్టార్లు అవుతారని అనుకుంటాం. వాళ్లు ఆడే తీరు, గేమ్ అవేర్నెస్, డెడికేషన్, సాధించాలనే తపనను బట్టి నెక్స్ట్ సూపర్ స్టార్స్ అవుతారని భావిస్తాం. కానీ ఏ ముగ్గురు, నలుగురో మాత్రమే తమ కెరీర్లను సుదీర్ఘ కాలం పాటు పొడిగించుకోగలరు. ఇది అందరు ప్లేయర్లకు సాధ్యమయ్యేది కాదు. ఆటగాళ్లు రాణించినప్పుడు కాదు వాళ్లు ఫెయిలైనా టీమ్‌లో నుంచి తొలగించకుండా ఉండాలి. ప్లేస్ పక్కా అని ధైర్యం ఇచ్చి ఆడించే కెప్టెన్, కోచ్ ఉండాలి. అప్పుడే క్రికెటర్లు ఫామ్ దొరకబుచ్చుకొని తమదైన శైలిలో ఆడగలరు. ఇలా ధైర్యం ఇవ్వబట్టే చాలా మంది యంగ్‌స్టర్స్ స్టార్లుగా, సూపర్ స్టార్లుగా మారారు. అయితే మరికొందరు మాత్రం అనామకులుగా మిగిలిపోయారు. ఇక, తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు భారత బ్యాటర్ మనోజ్ తివారీ. అయితే తన కెరీర్ నాశనమవడానికి ఎంఎస్ ధోనీనే కారణమని అతడు ఆరోపించాడు.
భారత జట్టు తరఫున అంతగా పేరు తెచ్చుకోకపోయినా డొమెస్టిక్ క్రికెట్లో లెజెండరీ బ్యాటర్‌గా ఉన్నాడు మనోజ్ తివారీ. సోమవారం క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా బిహార్‌తో జరిగిన మ్యాచే అతడి కెరీర్లో చివరిదిగా నిలిచింది. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తన ఇంటర్నేషనల్ కెరీర్ గురించి తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా స్టార్ అవ్వాల్సిందని.. కానీ ధోని టీమ్‌లో నుంచి తీసేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నాడు. ‘ధోనీని ఎప్పుడైనా కలిసే అవకాశం వస్తే అతడ్ని ఒకే ప్రశ్న అడుగుతా. సెంచరీ చేసిన తర్వాత కూడా టీమిండియాలో నుంచి నన్ను ఎందుకు తీసేశారు? అని అతడ్ని క్వశ్చన్ చేస్తా. అప్పటి ఆస్ట్రేలియా టూర్లో ఎవరూ పరుగులు చేయలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా.. ఇలా అందరూ ఫెయిలయ్యారు’ అని మనోజ్ తివారీ చెప్పుకొచ్చాడు.
ఆసీస్ టూర్లో కోహ్లీ, రోహిత్, రైనా ఫెయిలయ్యారని.. కానీ సెంచరీ చేసిన తనను మాత్రమే టీమ్‌లో నుంచి తీసేశారని మనోజ్ తివారీ వాపోయాడు. ఇప్పుడు తాను కోల్పోవడానికి ఏమీ లేదన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 65 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న సమయంలో తన బ్యాటింగ్ యావరేజ్ 65గా ఉందని అయినా తనకు టెస్టు క్యాప్ దక్కలేదన్నాడు తివారీ. ఆసీస్ భారత్‌కు వచ్చినప్పుడు జరిగిన ఫ్రెండ్లీ గేమ్‌లో 130 పరుగులు చేశానని.. ఇంగ్లండ్ ఇక్కడకు వచ్చినప్పుడు 93 రన్స్ చేశానని అయినా తనకు బదులుగా యువరాజ్ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారని తెలిపాడు. సెంచరీ బాదినా 14 మ్యాచుల పాటు జట్టుకు దూరం చేశారని.. ఒక ప్లేయర్ నమ్మకాన్ని చంపేయడానికి ఇదొక్కటి చాలు అని పేర్కొన్నాడు తివారీ. తన కెరీర్ నాశనమవడం వెనుక చాలా మంది హస్తం ఉందని.. వాళ్ల పేర్లు బయటపెట్టడం ఇష్టం లేదన్నాడు. మరి.. ధోనీపై తివారీ చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు యువ క్రికెటర్లు మృతి!
Manoj Tiwari said, “I would like to ask MS Dhoni why I was dropped from the XI in 2011 after scoring a century. I had the potential to be a hero just like Rohit Sharma and Virat Kohli. Today I see many getting opportunities, I feel sad”. pic.twitter.com/iT4f2iYtV0
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 19, 2024