రోహిత్ శర్మ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన స్టైలిష్ బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్. భారత జట్టులోకి బ్యాట్స్‌మన్‌గా అడుగుపెట్టాడు రోహిత్. అయితే బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్‌గానూ, ఫీల్డర్‌గానూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ 2011 వరల్డ్ కప్ టీమ్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఆ తర్వాత వరుసగా విఫలమవ్వడంతో అతడి పనైందని అంతా అనుకున్నారు. కానీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రోహిత్ ఫేట్ మారిపోయింది. ఆ టోర్నీలో ఓపెనర్‌గా ప్రమోషన్ రావడంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రోహిత్ దూకుడు ఎక్కడా తగ్గలేదు. సెంచరీల మీద సెంచరీలు, డబుల్ సెంచరీలు కొడుతూ టీమ్‌లో టాప్ ప్లేయర్‌గా మారిపోయాడు. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి ట్రోఫీలు అందించాడు. విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టి సక్సెస్‌ఫుల్‌గా టీమ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ఒక సమయంలో మాత్రం రోహిత్ బ్యాడ్ ఫేస్‌ను ఎదుర్కొన్నాడు. దీని గురించి భారత దిగ్గజ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఫామ్ కోల్పోయి రన్స్ చేసేందుకు ఇబ్బందిపడుతున్న టైమ్‌లో రోహిత్లో ఎంఎస్ ధోని నమ్మకం కలిగించాడని అన్నాడు.
ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే రోహిత్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ కల్పించి నేడు ఈ స్థాయికి ధోని చేర్చాడని గంభీర్ చెప్పాడు. మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన సపోర్ట్ వల్లే రోహిత్ శర్మ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడని గంభీర్ ప్రపంచానికి తెలియజేశాడు. కెరీర్ మొదట్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్.. అనంతరం వరల్డ్‌లోనే బెస్ట్ ప్లేయర్‌గా ఎదిగాడన్నాడు. టాలెంట్ ఉన్నవారిని గుర్తించడంలో ధోని స్టైలే వేరని.. రోహిత్‌కు అండగా నిలిచాడని గంభీర్ గుర్తుచేశాడు. ధోని సపోర్ట్ ఇచ్చినందు వల్లే రోహిత్లో ఇంతటి విధ్వంసక బ్యాటర్‌ను చూడగలుగుతున్నామని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఎవరీ దునిత్ వెల్లలాగే!
Gautam Gambhir said, “Rohit Sharma is Rohit Sharma today because of MS Dhoni. MS backed him continuously in his initial struggling phase”. pic.twitter.com/7bNleo4MGC
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2023