iDreamPost

2024 ఎన్నికల్లో గెలిచి.. అధ్యక్షా అనబోతున్న సినీ తారలు వీరే!

Lok Sabha Elections 2024: ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీ తరుపు నుంచి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. కొతమంది ఘన విజయం అందుకున్నారు.

Lok Sabha Elections 2024: ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీ తరుపు నుంచి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. కొతమంది ఘన విజయం అందుకున్నారు.

2024 ఎన్నికల్లో గెలిచి.. అధ్యక్షా అనబోతున్న సినీ తారలు వీరే!

సినీ ఇండస్ట్రీలో తమకంటూ మంచి ఫేమ్ సంపాదించిన నటీనటులు తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటారు. కొంతమంది నటులు సొంత పార్టీ పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఎన్టీఆర్,ఎంజీఆర్, విజయ్ కాంత్, కమల్ హాసన్ తో పాటు ఈ మద్యనే విజయ్ కూడా కొత్తగా ఓ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఇలా ఎంతోమంది సినీ నటులు కొత్త పార్టీలు స్థాపించి ప్రభంజనం సృష్టించారు. నిన్న దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. ఈసారి ప్రధాన పార్టీల తరుపు నుంచి సినీ తారలు పోటీ చేసి గెలిచారు. ఇంతకీ ఆ తారలు ఎవరు.. ఏ పార్టీ నుంచి గెలిచారు అన్న విషయం గురించి తెలుసుందాం. వివరాల్లోకి వెళితే..

దేశంలో ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సినీ తారలు మెరిశారు. ఇండస్ట్రీలో తమకంటూ మంచి పేరు సంపాదించిన పలువురు నటీనటులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మంగళవారం (జూన్4)న వెలువడిన ఫలితాల్లో ఘన విజయం అందుకున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 293 సిట్లు మెజార్టీ సాధిస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఈసారి ఎంపీ స్థానాలకు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ సారి లోక్ సభ స్థానాలకు పోటీ చేసి గెలిచి అధ్యక్షా అనేది ఎవరో? తెలుసా.. వారి వివరాలు మీ కోసం..

హేమా మాలిని: భారతీయ చిలన చిత్ర రంగంలో ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలేసిన డ్రీమ్ గర్ల్. నటి, నిర్మాత, దర్శకులు గానే కాదు ట్రెడిషనల్ డ్యాన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించింది. పలు యాడ్స్ లో నటించింది.  బీజేపీ అభ్యర్థినిగా మధుర నియోజకవర్గం నుంచి వరుసగా మూడో సారి ఘన విజయం సాధించింది. సమాజ్ వాది పార్టీ అభ్యర్థిపై 2,93,407 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందింది.

కంగనా రౌనత్ : బాలీవుడ్‌లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ నటి కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బాలీవుడ్ క్వీన్ గా పిలిచే ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో మోడల్‌గా కొనసాగించింది. బాలీవుడ్ లోనే కాదు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ తన స్వస్థలం మండి నుంచి బీజేపీ అభ్యర్థి గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 74,755 ఓట్ల మెజార్టీతో తెలుపొందింది.

అరుణ్ గోవిల్ : ఒకప్పుడు బుల్లితెరపై వచ్చిన రామాయణం సీరియల్ లో రాముడి పాత్రలో కనిపించిన అరుణ్ గోవిల్ కోట్ల మంది ప్రజాభిమానం సంపాదించారు. తర్వాత పలు సినిమాల్లో నటించారు. తెలుగు‌లో కూడా ఆయన కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. అరుణ్ గోవిల్ ఇటీవల ఆర్టికల్ 370 మూవీలో ప్రధాని పాత్రలో నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సారి ఎన్నికల్లో ఆయన బీజేపీ తరుపు నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ నుంచి పోటీ చేశారు.సమాజ్ వాది పార్టీ అభ్యర్థిపై సునిత వర్మపై 10,585 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

శతృఘ్న సిన్హా:బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శతృఘ్న సిన్హా. ఆయన కూతురు సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుంది. గత కొంత కాలంగా ఆయన రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యునిగా అసన్సోల్ నియోజక వర్గం నుంచి ఘన విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై ఎంపీగా 59,564 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మనోజ్ తివారీ : నటుడు, గాయకుడుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. భోజ్‌పురి సూపర్ స్టార్ మనోజ్ తివారీ ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు. 2024 ఎన్నికల ఫలితాల్లో ఈశాన్య ఢిల్లీ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కన్హయ్య కుమార్ పై 1,37,066 ఓట్ల మెజార్టీతో వరుసగా మూడోసారి ఘన విజయం సాధించాడు.

రవి కిషన్ : ఈ పేరు వినగానే అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం’ గుర్తుకు వస్తుంది. మద్దాలీ శివారెడ్డి అనే నేను.. అంటే తన నటనతో అదరగొట్టాడు. నార్త్, సౌత్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బోజ్ పురి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందిన ఆయన తర్వాత విలన్ గా నటించారు. గోరఖ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చసి తన ప్రత్యర్థిపై 1,03,526 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.

సురేష్ గోపీ: ఒకప్పుడు మాలీవుడ్ లో యాంగ్రీ యంగ్‌మాన్‌గా పేరు తెచ్చుకున్నారు సురేష్ గోపి. పోలీస్ అధికారి పాత్రల్లో బాగా సెట్ అయ్యేవారు. ఆ తరహా పాత్రలతోనే ఆయన బాగా పాపులర్ అయ్యారు. హీరోగానే కాదు.. ఇటీవల క్యారెక్టర్ పాత్రలతో పాటు విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. 2016 నుంచి 2022 వరకు సురేష్ గోపి ఎంపీగా రాజ్యసభ కు నామినేట్ అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి