iDreamPost
android-app
ios-app

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం.. నిర్మాత అరెస్ట్‌!

  • Published Sep 14, 2023 | 6:23 PM Updated Updated Sep 14, 2023 | 6:23 PM
  • Published Sep 14, 2023 | 6:23 PMUpdated Sep 14, 2023 | 6:23 PM
మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం.. నిర్మాత అరెస్ట్‌!

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు తాజాగా మరో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. తాజాగా అరెస్ట్‌ అయిన వారిలో ఓ సినీ నిర్మాతతో పాటు ఓ ప్రజా ప్రతినిధి కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారిలో ముగ్గురు నైజీయన్లు కూడా ఉన్నారు. వీరివద్ద నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్‌, 24 ఎక్టసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆగస్టు 31న పక్కా సమాచారంతో నార్కోటిక్‌ విభాగం పోలీసులు గుడిమల్కాపూర్‌, మాదాపూర్‌లలో దాడులు చేశారు.

ఈ దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి బాలాజీ, సినీ ఫైనాన్షియర్‌ వెంకటరత్నారెడ్డి, మురళిలను అరెస్ట్‌ చేశారు. వారిని రిమాండ్‌కు కూడా తరలించారు. వారిని రిమాండ్‌లో ఉంచి విచారిస్తున్నారు. దాదాపు మూడు రోజులనుంచి వారిని విచారిస్తున్నారు. వారు చెప్పే వివరాల ఆధారంగా మరికొందరిని కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. మరి,  మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఓ సినీ నిర్మాతతో పాటు ఓ ప్రజా ప్రతినిధి కుమారుడు అరెస్ట్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet