iDreamPost
android-app
ios-app

గూగుల్ సెర్చ్ లో షారుఖ్ ఖాన్ – విజయ్ ల సినిమాలు

  • Published Feb 27, 2024 | 6:59 PM Updated Updated Feb 27, 2024 | 6:59 PM

Most Searched Movies: సినిమాలు రిలీజ్ కావడం, రికార్డులు క్రియేట్ చేయడం మామూలే. అలాగే ఏటా గూగుల్ లో మోస్ట్ సెర్చ్డ్ మూవీస్ లిస్ట్ కూడా ఉంటుంది. మరి.. ఈసారి ఏ మూవీస్ కి టాప్ 10 స్థానం దక్కిందో చూడండి.

Most Searched Movies: సినిమాలు రిలీజ్ కావడం, రికార్డులు క్రియేట్ చేయడం మామూలే. అలాగే ఏటా గూగుల్ లో మోస్ట్ సెర్చ్డ్ మూవీస్ లిస్ట్ కూడా ఉంటుంది. మరి.. ఈసారి ఏ మూవీస్ కి టాప్ 10 స్థానం దక్కిందో చూడండి.

  • Published Feb 27, 2024 | 6:59 PMUpdated Feb 27, 2024 | 6:59 PM
గూగుల్ సెర్చ్ లో షారుఖ్ ఖాన్ – విజయ్ ల సినిమాలు

సోషల్ మీడియాలో క్రేజ్ అనేది హీరో హీరోయిన్ల స్టార్ ఇమేజ్ కు అదనపు ఆకర్షణలా పని చేస్తాయి. తమ అభిమాన స్టార్ల లేటెస్ట్ అప్డేట్స్ కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు సినీ ప్రేక్షకులు. ప్రతి సంవత్సరం గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితా అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ తాజాగా విడుదలైంది.

2023లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల్లో షారుఖ్ ఖాన్ నటించిన రెండు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల్లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ మొదటి, ఐదో స్థానాల్లో నిలిచాయి. ఇక రెండో స్థానంలో సన్నీడియోల్ ‘గదర్ 2’, మూడో స్థానంలో క్రిస్టోఫర్ నోలన్ ‘ఒపెన్ హైమర్’, నాలుగో స్థానంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఉన్నాయి. వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ గూగుల్ సెర్చ్ లలో ఆరో స్థానంలో, రజినీకాంత్ జైలర్ ఏడో స్థానంలో నిలిచాయి. దళపతి విజయ్ నటించిన రెండు చిత్రాలు లియో, వారీసు ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో నిలవగా చివరి స్థానం సల్మాన్ ఖాన్ టైగర్ 3కి దక్కింది.

టీవీ షోలు, వెబ్ సిరీస్ లకు కూడా గూగుల్ టాప్ టెన్ సెర్చ్ లు విడుదలయ్యాయి. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించగా రాజ్ – డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఫర్జీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో వెడ్నస్డే, మూడో స్థానంలో అసుర్ ఉండగా.. తరువాతి స్థానాల్లో రానా నాయుడు, ది లాస్ట్ ఆఫ్ అస్, స్కామ్ 2023, బిగ్ బాస్ 17, గన్స్ అండ్ గులాబ్స్, సె*క్స్/లైఫ్, తాజా ఖబర్ ఉన్నాయి. మరి.. ఈ చిత్రాలు, వెబ్ సిరీస్ లో మీరు చూసిన, మీకు బాగా నచ్చినవి ఏవో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet