iDreamPost
android-app
ios-app

ఆస్పత్రి బెడ్ పై మహ్మద్ షమీ.. అసలేం జరిగింది?

  • Published Feb 27, 2024 | 10:23 AM Updated Updated Feb 27, 2024 | 10:23 AM

Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆస్పత్రి బెడ్ పై ట్రీట్ మెంట్ తీసుకుంటున్న పిక్స్ ను అతడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో షమీకి ఏమైంది? అంటూ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.

Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆస్పత్రి బెడ్ పై ట్రీట్ మెంట్ తీసుకుంటున్న పిక్స్ ను అతడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో షమీకి ఏమైంది? అంటూ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.

ఆస్పత్రి బెడ్ పై మహ్మద్ షమీ.. అసలేం జరిగింది?

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళనపడుతున్నారు. ఆస్పత్రి బెడ్ పై ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఫొటోను షమీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాడంతో.. ఫ్యాన్స్, క్రికెట్ అభిమానులు షమీకి ఏమైంది అంటూ ఆరాతీస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మహ్మద్ షమీ.. వన్డే వరల్డ్ కప్ 2023లో హీరో. లేట్ గా వచ్చినా గానీ, అద్భుతమైన బౌలింగ్ తో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా మెగాటోర్నీలో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే వరల్డ్ కప్ లో కాలికి గాయం అయినప్పటికీ.. ఇంజెక్షన్లు తీసుకుని మరీ ఆడిన విషయం మనకుతెలిసిందే. ఇక ఆ ఇంజ్యూరీ కారణంగానే సౌతాఫ్రికాతో జరిగిన, ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లకు దూరమైయ్యాడు. అయితే తన కాలి మడమకు అయిన గాయానికి తాజాగా సర్జరీ చేయించుకున్నాడు షమీ. లండన్ లో సోమవారం సాయంత్ర షమీకి విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా అతడే ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోలను షేర్ చేశాడు.

what happend to shami

“నా కాలికి యాంకిల్ సర్జరీ విజయవంతంగా జరిగింది. అయితే పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చి.. ట్రీట్ మెంట్ తీసుకుంటున్న పిక్స్ షేర్ చేశాడు. అయితే తొలుత ఈ పిక్స్ చూసి ఆందోళన పడ్డ ఫ్యాన్స్.. ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యారు. షమీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్ తో ఐపీఎల్ 2024 సీజన్ కు పూర్తిగా దూరం కానున్నాడు. గాయం నుంచి కోలుకుంటే.. టీ20 వరల్డ్ కప్ 2024 కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదికూడా చదవండి: సెలెక్టర్లపై కోపం.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్!