iDreamPost
android-app
ios-app

కొడుకు క్రీజ్ లో ఉన్నా.. సచిన్ అవుటవ్వగానే ఛానల్ మార్చేసిన స్టార్ క్రికెటర్ పేరెంట్స్!

  • Author Soma Sekhar Updated - 09:26 PM, Thu - 13 July 23
  • Author Soma Sekhar Updated - 09:26 PM, Thu - 13 July 23
కొడుకు క్రీజ్ లో ఉన్నా.. సచిన్ అవుటవ్వగానే ఛానల్ మార్చేసిన స్టార్ క్రికెటర్ పేరెంట్స్!

అది 2002 జూలై 13 సరిగ్గా ఇదే రోజు.. విదేశీ గడ్డపై అదీ క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్ లో చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది టీమిండియా. దాంతో లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి గంగూలీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. ఆ సెలబ్రేషన్స్ ఇప్పటికీ ప్రతీ భారతీయుడికి గుర్తే. నాట్ వెస్ట్ సిరీస్ ను టీమిండియా గెలుచుకోవడంతో పాటుగా.. కేవలం 5 నెలల్లోనే ఇంగ్లాండ్ పై ప్రతీకారన్ని తీర్చుకుంది టీమిండియా. ఈ విజయానికి నేటితో 21 ఏళ్లు పూర్తి కావడంతో.. అప్పటి ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్. నేను క్రీజ్ లో ఉన్నాగానీ.. సచిన్ అవుటవ్వగానే మా అమ్మానాన్న ఛానల్ మార్చి షారుఖ్ ఖాన్ సినిమా చూశారని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్లేయర్.

లార్డ్స్.. ఈ పేరు వినగానే మెుదటగా ప్రతీ భారతీయుడికి గుర్తుకు వచ్చే వీడియో ఒక్కటే.. టీమిండియా జెర్సీ విప్పి లార్డ్స్ బాల్కనీలో గంగూలీ చేసిన రచ్చ. ఆ రచ్చకి నేటితో 21 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అప్పటి స్టార్ క్రికెటర్, మాజీ ఆటగాడు ఓ ఆసక్తికర సంఘటనను షేర్ చేసుకున్నాడు. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు. టీమిండియా ఫీల్డింగ్ కు కొత్త హంగులు అద్దిన మహ్మద్ కైఫ్. నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ బక్కపలచని ఆటగాడు.

ఈ మ్యాచ్ లో కైఫ్ 75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి, టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని కట్టబెట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో ఒక దశలో 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 14 పరుగులకే వెనుదిరగడంతో.. టీమిండియా ఓడిపోయిందని ఫిక్స్ అయిన కైఫ్ తల్లిదండ్రులు ఛానల్ మార్చి.. హాయిగా షారుఖ్ ఖాన్ ఎవర్ గ్రీన్ సినిమా ‘దేవదాసు’ చూశారట. ఈ మ్యాచ్‌కి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి గుర్తులను సోషల్ మీడియాలో పంచుకున్నాడు కైఫ్. సచిన్ అవుట్ కావడంతో.. ఎలాగూ టీమిండియా ఓడిపోతుందని, కొడుకు క్రీజ్ లో ఉన్నా.. మ్యాచ్ చూడలేదని వారు తెలిపారని కైఫ్ పేర్కొన్నాడు.

అయితే ఆ తర్వాత టీవీలో హైలైట్స్ ను వెయ్యి సార్లు చూసినట్లుగా కైఫ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇక లార్డ్స్ లో దాదాని అలా చూడటం మా నాన్నకి చాలా సంతోషం వేసిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు కైఫ్. ఈ మ్యాచ్ లో టీమిండియా 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. మరి సచిన్ క్రేజ్ ఏంటో మరోసారి ఈ సంఘటన గుర్తు చేసిందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కైఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.