iDreamPost

నా భర్త కామాంధుడు! నైట్ అంతా అమ్మాయిలతో ఆ గేమ్స్: మిస్ వైజాగ్

Miss Vizag Nakshatra: విశాఖలో దారుణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. భర్త మరో మహిళతో ఉండగా మిస్ వైజగ్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం తన భర్త గురించి అనే సంచలన విషయాలను తెలిపింది.

Miss Vizag Nakshatra: విశాఖలో దారుణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. భర్త మరో మహిళతో ఉండగా మిస్ వైజగ్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం తన భర్త గురించి అనే సంచలన విషయాలను తెలిపింది.

నా భర్త కామాంధుడు! నైట్ అంతా అమ్మాయిలతో ఆ గేమ్స్: మిస్ వైజాగ్

మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర…తన భర్త వేరే మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసింది. గురువారం ఆమె భర్త వేరే యువతితో ఓ రూమ్ లో ఉండగా నక్షత్ర పట్టుకుంది. ఇక ఈ వ్యవహారం  ప్రస్తుతం  హాట్ టాపిక్ గా మారింది. పోలీసులను, విలేకర్లను తీసుకెళ్లిన ఆమె భర్త వేరే యువతితో ఉండగా పట్టుకుంది. అంతేకాక ఆ యువతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నక్షత్రకు ఆమె భర్తకు మధ్య గొడవ కూడా జరిగింది. ఈ ఘటనపై నక్షత్ర అనేక విషయాలు చెప్పింది. తన భర్త కామాంధుడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఆమె… తన భర్త గురించి అనేక విషయాలను చెప్పింది.

2012లో మిస్ వైజాగ్ గా నక్షత్ర ఎంపికయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాల్లో చేసింది. ఈ క్రమంలో 2013లో ఆమెకు తేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు పెద్దల అంగీకారంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. 2020 వరకు వీరి కాపురం సజావుగా సాగింది.  ఆ తరువాతనే పూర్తిగా మరిపోయింది.  2020-21 టైమ్ లోనే  తేజ నిజస్వరూపం బయటపడింది. వేరే మహిళలతో సంబంధం పెట్టుకున్నాడు. తాజాగా ఆమె..తన భర్తను వేరే యువతితో ఉండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంది.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..” అతడు ఉమెనైజర్. ఆడది కనిపిస్తే చాలు అన్నట్లు ఉంటాడు. అతడి ప్రవర్తన సరిగ్గా లేక నేవి ఉద్యోగంలో నుంచి తొలగించారు.  దీంతో  రోజూ రాత్రంత  అమ్మాయిలతో పబ్జీ గేమ్స్ ఆడేవాడు. తెల్లవారే వరకు అదే గేమ్  ఆడుతూ దరిద్రంగా మాట్లాడుకోవడం చేసేవాడు. తిరిగి ఉదయం పడుకోవడం చేసేవాడు. అసలు ఆఫీస్ కి వెళ్లేవాడు కాదు. 2020 వరకు బాగానే మా సంసారం బాగానే ఉంది. అతడి నిజ స్వరూపం తెలియడంతో అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. 2021లో ఆయన ఎఫైర్లు మొత్తం నాకు తెలిశాయి. నేను ఒక నెల నుంచి అతడిని ఫాలో చేస్తున్నాను. ఈ రోజు యువతితో రెడ్ హ్యాండెండ్ గా దొరికాడు. వీడికి అమ్మాయి అయితే చాలు, వావివరుసలు లేకుండా ప్రవర్తిస్తుంటాడు. ఇంకా సొంత అక్కను కూడా అదే ఉద్దేశంతో చేసేవాడు. ఇలాంటి కామాంధులకు శిక్షపడాలి. ఇప్పుడు అతడితో పట్టుబడిన ఆ  అమ్మాయి కూడా నన్ను బెదిరిస్తుంది. నువ్వు నీ కూతురితో ఎలా బతుకుతావో నేను చూస్తాను అంటు బెదిరిస్తుంది” అని నక్షత్ర చెప్పుకొచ్చారు.

తనకు ఓ పాప ఉందని.. పాప కోసం తాను అతడు చేసిన దారుణాలు భరిస్తున్నానని నక్షత్ర చెప్పుకొచ్చింది. తాను తాను ఎంత భరిస్తు వస్తున్నా అతడు మారడం లేదని, ఇప్పుడు ఏకంగా మరో మహిళను భార్యగా చెప్పుకుని రూమ్ లో ఉంటున్నాడని తెలిపింది. ప్రస్తుతం తేజ ఏం పని చేయడం లేదని, అతడు చేసే పనుల గురించి ప్రశ్నిస్తే.. తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని, అంతేకాక దారుణంగా కొట్టాడని నక్షత్ర చెప్పుకొచ్చింది. ఇలాంటి వాళ్లను అసలు వదలకూడదన్నది. రెండేళ్ల క్రితమే తన భర్తపై దిశలో ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ప్రస్తుతం నక్షత్ర చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి