iDreamPost
android-app
ios-app

జాతీయ స్థాయిలో సత్తా చాటిన AP యువతి.. మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం!

  • Published Jul 21, 2023 | 1:34 PM Updated Updated Jul 21, 2023 | 1:34 PM
  • Published Jul 21, 2023 | 1:34 PMUpdated Jul 21, 2023 | 1:34 PM
జాతీయ స్థాయిలో సత్తా చాటిన AP యువతి.. మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం!

సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకు అందాల పోటీలు అంటే.. కేవలం ఉత్తరాది వారు మాత్రమే అన్న అభిప్రాయం ఉండేది. తెలుగు యువతులు అందాల పోటీలు, మోడలింగ్‌, సినిమాలు వంటి వాటికి దూరంగా ఉండేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు.. గ్లామర్‌ ఫీల్డ్‌పై ఉన్న అభిప్రాయం కూడా మారుతూ వస్తోంది. నేడు గ్లామర్‌ ఫీల్డ్‌లో తెలుగు అమ్మాయిలు రాణిస్తున్నారు. యూట్యూబ్‌, వెబ్‌ సిరీస్‌ పుణ్యమా అని తెలుగందాలు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాయి. తాజాగా వచ్చిన బేబీ చిత్రం హీరోయిన్‌ వైష్ణవి ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కేవలం గ్లామర్‌ ఫీల్డ్‌లో మాత్రమే కాక.. అందాల పోటీల్లో సైతం పాల్గొంటున్నారు తెలుగు యువతులు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి ఒకరు జాతీయ స్థాయిలో అందాల పోటీల్లో సత్తా చాటింది. ఆ వివరాలు..

జాతీయ స్థాయిలో నిర్వహించిన అందాల పోటీల్లో రాష్ట్రానికి చెందిన యువతి మెరిసింది. జులై 16న జైపూర్‌లో జరిగిన ‘మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా-2023’ పోటీల్లో చంద్రగిరికి చెందిన సంజన మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం గెలుచుకుంది. ఈ పోటీల్లో భాగంగా 2023 మే నెలలో బెంగళూరులో నిర్వహించిన ప్రిలిమినరీ రౌండ్‌లో 300 మందికి పైగా టీనేజ్‌ యువతులు జూమ్‌ కాల్‌ ద్వారా పోటీలో పాల్గొన్నారు. ఈ 300 మంది నుంచి ఫైనల్స్‌కు 57 మంది ఎంపికయ్యారు. వారిలో సంజన కూడా ఉంది.

ఈ పోటీలకు సంబందించి జూలై నెల 16 నుంచి జైపూర్‌లో జరిగిన గ్రాండ్‌ ఫైనల్‌లో 47 మంది పోటీదారులు పాల్గొన్నారు. వారిలో మిగతావారిని వెనక్కి నెట్టి.. ఏపీకి చెందిన సంజన మొదటి స్థానంలో నిలిచి కిరీటం కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సంజలన తల్లిదండ్రులు గురువారం మీడియాకు తెలిపారు. కాగా సంజన చంద్రగిరి మాజీ ఎంపీటీసీ అల్లతూరు మోహన్‌ మనమరాలు కావడం విశేషం. తమ ప్రాంతానికి చెందని యువతి ఇలా అందాల కిరీటం గెలుచుకోవడం గర్వంగా ఉందంటున్నారు స్థానికులు.