iDreamPost

తెలంగాణకు ఎలక్ట్రిక్ వెహికిల్ దిగ్గజం ‘టెస్లా’? ఎలాన్ మస్క్ తో చర్చలు!

  • Published Apr 05, 2024 | 4:39 PMUpdated Apr 05, 2024 | 4:39 PM

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి టెస్లా ను తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో దేశంలో ఎలాన్ మాస్క్ సంస్థ పెట్టుబడులు పెడుతుందనే ప్రకటనను విడుదల చేసిన తర్వాత.. గత ఏడాది డిసెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టింది.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి టెస్లా ను తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో దేశంలో ఎలాన్ మాస్క్ సంస్థ పెట్టుబడులు పెడుతుందనే ప్రకటనను విడుదల చేసిన తర్వాత.. గత ఏడాది డిసెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టింది.

  • Published Apr 05, 2024 | 4:39 PMUpdated Apr 05, 2024 | 4:39 PM
తెలంగాణకు ఎలక్ట్రిక్ వెహికిల్ దిగ్గజం ‘టెస్లా’? ఎలాన్ మస్క్ తో చర్చలు!

దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువైపోయింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం.. “టెస్లా” ను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెడుతుంది. అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని.. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గత ఏడాది అంటే 2023 డిసెంబర్ నుంచే.. రాష్ట్రంలో టెస్లా పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నిస్తోందని.. ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా టెస్లా కంపెనీతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని కూడా ఆయన తెలియజేసారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ను శ్రీధర్ బాబు తన ఎక్స్‌లో షేర్ చేస్తూ.. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌కు కూడా ట్యాగ్ చేశారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మంత్రి శ్రీధర్ బాబు.. తమ ఎక్స్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.. “రాష్ట్రంలో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నాం.. భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నాం.. టెస్లా వంటి ప్రపంచంలోని మేటి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అనుమతులను సులభతరం చేశాం.. రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు, పెట్టుబడులు పెట్టించేందుకు టెస్లాతో పరిశ్రమల శాఖ, ప్రభుత్వంలోని ఇతర శాఖల అధికారులు నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నాయి” అంటూ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అంతకముందు బీఆర్ఎస్ మాజీ ఐటీ శాఖ మంత్రి కూడా దీనికి సంబంధించిన పోస్ట్ ను ఒకటి షేర్ చేశారు.

కాగా, ఆ పోస్ట్ లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇలా పేర్కొన్నారు.. “టెస్లా కంపెనీ దేశంలో రెండు లేక మూడు బిలియన్ డాలర్లతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ నెలకొల్పేందుకు చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించాలి” అంటూ వెల్లడించారు. దీనికి స్పందనగానే మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్నీ చర్చించారని భావిస్తున్నారు ప్రజలు. ఏదేమైనా.. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి.. ఉపాధి అందించడం కోసం పార్టీ నేతలు ఎప్పటికప్పుడు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అనుకున్న విధంగా టెస్లా కంపెనీ కనుక తెలంగాణాలో ఏర్పాటు అయితే.. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రము మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి