iDreamPost
android-app
ios-app

ఆ సినిమా వల్ల భారీగా నష్టపోయాం.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

  • Published Apr 14, 2024 | 6:54 PM Updated Updated Apr 14, 2024 | 6:54 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి. అయితే ఈ సినిమా గురించి ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి. అయితే ఈ సినిమా గురించి ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

  • Published Apr 14, 2024 | 6:54 PMUpdated Apr 14, 2024 | 6:54 PM
ఆ సినిమా వల్ల భారీగా నష్టపోయాం.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా ‘నరసింహారెడ్డి’. కాగా, ఈ సినిమాను స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. అయితే ఈసినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నిర్మించారు. అయితే ఈ సినినమా 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల చేశారు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైర నరసింహారెడ్డి ఇటు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ వంటి భాషల్లో కూడా విడుదలయింది. ఇక ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో తర్వాత.. తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి చాలా అద్భుతంగా నటించారు. అలాగే అప్పటిలో ఈ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంది. కానీ, కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమాకు నష్టాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరానరసింహారెడ్డి సినిమాను 2019లో గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ లో రూ. 200 కోట్లతో రామ్ చరణ్ నిర్మించారు. అయితే అంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించడం అంటే కష్టం అనిపించినా.. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో.. ఖర్చుల్లో ఏమాత్రం రాజీ పడకుండా సైరా సినిమాను నిర్మించారు. కాగా, , అప్పటిలో సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకోగా.. మరికొన్ని చోట్ల మాత్రం నష్టాలను చవి చూసినట్లు టాక్ వినిపించింది. అయితే తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి తాను నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా పై కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సైరా నరసింహారెడ్డి సినిమా నష్టాలు మిగిల్చిన మాట నిజమే ఆయన స్వయంగా అంగీకరించారు. ఇక ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్ తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సైరా గురించి చిరంజీవి ఇలా అన్నారు. ‘ఇన్నేళ్ల నా సిని జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను, అలాగే చాలా సినిమాల్లో నటించాను. కానీ, వాటిలో కొన్ని నాకు సంతృప్తి ఇవ్వలేదు. ఇక పలాన పాత్ర చేయాలని అని మనం ఎదురు చూస్తే ప్రతిసారీ మనకు రావు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలనే కోరిక నాలో చాలా ఏళ్లుగా ఉండేది. చివరిగా సైరాతో ఆ కోరిక తీరిపోయింది.అయితే సైరా నరసింహారెడ్డి సినిమా నేను అనుకున్నంత విజయాన్ని అందించలేదు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంతగా మెప్పించలేదు. కానీ, మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సైరా బాగానే ఆడింది. దీంతో సైరా వల్ల భారీగానే నష్టంపోయాం.

ఇక గతంలో కూడా రుద్రవీణ సినిమా చేశాను. అయితే ఈ సినిమాను నా తమ్ముడు నాగబాబు నిర్మించాడు. పై ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. కానీ, డబ్బులు మాత్రం రాలేదు. అందువల్ల నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే నిర్మాత జేబులు ఖాళీ అవుతుంది. అందుకే వారి బాగు కోసం కమర్షియల్ సినిమాలనే ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది’ అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, చిరంజీవి సైరా సినిమా నష్టాలపై చేసిన వ్యాఖ్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet