iDreamPost

Acharya:హిందీలో రిలీజ్‌ కానున్న మెగాస్టార్‌ ‘ఆచార్య’ సినిమా!

  • Published Jan 09, 2024 | 12:25 PMUpdated Jan 09, 2024 | 12:25 PM

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల దర్శకత్వం వహించిన సినిమా ఆచార్య. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ హిందీలో రిలీజ్ చేయనున్నట్లు వార్త జోరుగా వినిపిస్తోంది. ఇంతకి అది ఎప్పుడంటే..

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల దర్శకత్వం వహించిన సినిమా ఆచార్య. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ హిందీలో రిలీజ్ చేయనున్నట్లు వార్త జోరుగా వినిపిస్తోంది. ఇంతకి అది ఎప్పుడంటే..

  • Published Jan 09, 2024 | 12:25 PMUpdated Jan 09, 2024 | 12:25 PM
Acharya:హిందీలో రిలీజ్‌ కానున్న మెగాస్టార్‌ ‘ఆచార్య’ సినిమా!

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే అభిమానులకు ఒక పెద్ద పండగలా ఉంటుంది. అలాంటిది మెగాస్టార్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒక ఫ్రేమ్ లో అలరించనున్నరంటే అది సినీ ప్రీయులకు డబుల్ ధమాకా అనే చెప్పవచ్చు. అలానే వీరిద్దరి కాంబీనేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ఆచార్య. ఇక ఒకే తెరపై తండ్రి, కొడుకు కలిసి నటిస్తున్నరనగానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. అసలే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం కావడంతో.. ఆచార్య సినిమా పై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయ్యింది. అయితే భారీ అంచనాల నడుమ 2022 ఏప్రిల్ 29న ప్రేక్షకుల ల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఆశించిన దానికంటే భారీ డిజాస్టర్ గా ఆచార్య సినిమా నిలిచింది. ఇక తెలుగులో ఇంత చెత్త రికార్డు గా నిలిచిన ఆచార్యని త్వరలో హిందీలో కూడా రిలీజ్ చేయనున్నరని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకి అది ఎప్పుడంటే..

ఒకవైపు దేవర గ్లిమ్ప్స్ తో సోషల్ మీడియాను షేకు చేస్తున్న తరుణంలో.. ప్రతిఒక్కరు కొరటాల శివ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల ఆడియన్స్ కొరటాల పై పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆచార్య సినిమా హిందీలో రిలీజ్ అవుతుందనే వార్త పై కొరటాలపై విమర్శల వర్షం గుప్పుమంటుంది. ఇక ఆచార్య సినిమా విషయానికి వస్తే మొదటి రోజే బాక్సాఫీస్ డీలా పడిపోయింది. రెండో రోజు నుంచే ఆచార్య కలెక్షన్లు అయితే దారుణంగా పడిపోయాయి. ఇది చిరంజీవి కేరిర్ లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అలాంటి డిజాస్టర్ మూవీని త్వరలో హిందీ వర్షెన్ లో సంక్రాతి కానుకగా జనవరి 11 నుంచి అందుబాటులోకి తీసుకొస్తుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాని ప్రముఖ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ అయిన పెన్ మూవీస్ లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో పాటు ఆచార్య సినిమా ట్రైలర్ ని కూడా పోస్ట్ చేశారు. అసలే తెలుగులో చెత్త రికార్డు సాధించిన ఆచార్య మూవీ ఇప్పుడు హిందీలో అవసరమా అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి తెలుగు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందని ఆచార్య హిందీలో అలరిస్తుందేమో చూడాలి.

aacharya movie released in hindi

ఇక ఆచార్య సినిమాకు రెమ్యూనరేషన్లు కూడా వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ ఎపిసోడ్ తీసేయడం, స్టోరీలో మార్పులు చేర్పులు జరగడం, రామ్ చరణ్ కోసం కథను పూర్తిగా మార్చడం ఇలా రకరకాల కారణాలతో ఆచార్య ఇలా బెడిసి కొట్టింది. దీంతో కొరటాల కథ మీద కాకుండా బిజినెస్ మీద ఫోకస్ పెట్టాడమో అని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరి, త్వరలో ఆచార్య మూవీ హిందీలో రిలీజ్ కాబోతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి