Keerthi
గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి తాజాగా ఓ తమిళ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఆ సినిమాలో ఓటీటీలో సందడి చేస్తుంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..
గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి తాజాగా ఓ తమిళ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఆ సినిమాలో ఓటీటీలో సందడి చేస్తుంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..
Keerthi
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ‘మీనాక్షి చౌదరి’. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మాడు పేరు ఇండస్ట్రీలో మారు మోగుతుంది. ఇటీవలే మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాతో మీనాక్షి తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మీనాక్షీ జాతకం మారిపోయింది. దీంతో వరుస అవకాశాలు అనేవి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ దుల్కర్ సల్మాన్ తో ‘లక్కీ భాస్కర్’, విశ్వక్ సేన్ తో ‘రామ్ తళ్లూరి సినిమా’, వరుణ్ తేజ్ ‘మట్కా’, దళపతి విజయ్‌తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’లో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా తాజాగా ఓటీటీలో సందడి చేస్తుంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..
ఇటీవలే మీనాక్షి చౌదరి హీరోయినన్ గా నటించిన తమిళ సినిమా ‘సింగపూర్ సెలూన్’. ఈ సినిమాను న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గోకుల్ తెరకెక్కించారు. అలాగే వేల్స్ ఫిలిం పతాకంపై ఐసరీ గణేష్ ఈ చిత్రన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న తమిళ్ థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. కాగా, ఇందులో ఆర్‌జే బాలాజీ హీరోగా నటించాడు. వీరితో పాటు సత్యరాజ్, లాల్, దర్శకుడు కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమాను 7 కోట్లు బడ్జెట్ తో రూపొందించగా.. ఇప్పటి వరకు 10 కోట్లు పైగానే వసూళ్లను రాబెట్టింది. ఇక తాజాగా ఈ తమిళ్ మూవీ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం సింగపూర్ సెలూన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కేవలం తమిళ్ వెర్షన్ లో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. అతడితో పాటు అరవింద్ స్వామి, హీరో జీవా కూడా అతిథి పాత్రల్లో మెరిశారు.
ఇక సింగపూర్ సెలూన్ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని, అలాగే సొంతంగా ఓ సెలూన్ షాప్ ఏర్పాటు చేసుకోవాలని కాథిర్ (ఆర్‌జే బాలాజీ) కలలు కంటాడు. కానీ, ఇంజినీరింగ్ చదివిన అతడు వారసత్వంగా.. తండ్రి నుంచి వచ్చిన వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి? సొంతంగా సెలూన్ ఏర్పాటుచేసిన కాథిర్‌కు పోటీదారుల నుంచి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి. ఇలా ఎమోషన్స్, కామెడీ ను దర్శకుడు గోకుల్ ఈ సినిమాలో చూపించాడు. ఇక కాథిర్‌ను ప్రేమించే అమ్మాయి మీనాక్షి చౌదరి మంచి డబ్బున్న కుటుంబానికి చెందినదిగా కనిపించనుంది. మరి, ఓటీటీలో సందడి చేస్తున్నా మీనాక్షి చౌదరి సింగపూర్ సెలూన్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.