iDreamPost

శంషాబాద్ మంజుల హత్య కేసులో విస్తుపోయే నిజాలు!

శంషాబాద్ మంజుల హత్య కేసులో విస్తుపోయే నిజాలు!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సచలనం సృష్టించిన శంషాబాద్ మంజుల హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అసలు హత్య జరగడానికి కారణం ఏంటనేదానిపై పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. మంజుల హత్య కేసుకు ఆర్థిక లావాదేవీలే కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 10న కడుపునొప్పిగా ఉంది.. ఆస్పత్రికి వెళ్తానని బయటకు వచ్చిన మంజుల తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కనిపించడం లేదని భర్త లక్ష్మయ్య శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

మంజుల శంషాబాద్ మహిళ మృతికి డబ్బే కారణమని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొందరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. ఒక మహిళ, ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారించారు. రిజ్వానా అనే మహిళను ప్రధాన నిందితురాలిగా పోలీసులు భావిస్తున్నారు. రిజ్వానా మంజుల ఇంటి దగ్గర్లో ఎంపోరియం నడుపుతోంది. ఆమెకు మంజుల రూ.లక్ష అప్పుగా ఇచ్చింది. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ మంజుల భర్త ఇప్పటికే చాలాసార్లు నిలదీశాడు. అయినా వాళ్లు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. పైగా రెండు నెలలుగా వడ్డీ కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. డబ్బు కోసం ఒత్తిడి తీసుకురావడం వల్లే ఇలాంటి పని చేసి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పెట్రోల్ బంక్ లో 5 లీటర్ల డీజిల్ కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులనే నిందితులుగా చేర్చారు. మంజుల అదృశ్యం, హత్య గురించి ఆమె కోడలు కీలక వ్యాఖ్యలు చేసింది. “హాస్పిటల్ కు వెళ్తున్నాను అని చెప్పి ఉదయం 10 గంటలకు అత్తయ్య బయటకు వెళ్లారు. తర్వాత ఆమె ఎక్కడ ఉన్నారు. ఎందుకు ఇంకా రాలేదు అని ఎన్నిసార్లు కాల్ చేసినా లిప్ట్ చేయలేదు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. అప్పటికే సాయి ఎన్ క్లేవ్ లో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని తెలిసింది. మెట్టెలు, గాజులు, బీరువా తాళాల ఆధారంగా ఆమె మా అత్త మంజుల అనే గుర్తించాం. ఆమె వంటిపై ఉండే బంగారు నగలు, తాళిబొట్టు హత్య తర్వాత కనిపించలేదు. నిందితులు ఎవరో గుర్తించి.. పోలీసులు వారిని కఠినంగా శిక్షించాలి” అంటూ మంజుల కోడలు అఖిల డిమాండ్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి