iDreamPost
android-app
ios-app

IPL 2024: మయాంక్ యాదవ్ మరో చరిత్ర.. హేమాహేమీలకే సాధ్యం కాలేదు! ఏకైక ప్లేయర్ గా..

  • Published Apr 03, 2024 | 9:05 PM Updated Updated Apr 03, 2024 | 9:05 PM

ఆడిన రెండు మ్యాచ్ ల్లోనే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో హేమాహేమీలు సాధించలేని ఘనతను సాధించి.. ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆడిన రెండు మ్యాచ్ ల్లోనే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో హేమాహేమీలు సాధించలేని ఘనతను సాధించి.. ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024: మయాంక్ యాదవ్ మరో చరిత్ర.. హేమాహేమీలకే సాధ్యం కాలేదు! ఏకైక ప్లేయర్ గా..

మయాంక్ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ మాట్లాడుకుంటున్న స్పీడ్ బౌలర్. నిప్పులు చెరిగే బంతులతో కేవలం రెండు మ్యాచ్ ల్లోనే ఈ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పటికే వరుసగా అత్యధిక ఫాస్టెస్ట్ బాల్స్ విసిరిన బౌలర్ గా చరిత్ర సృష్టించిన మయాంక్.. తాజాగా మరో ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో హేమాహేమీలకే సాధ్యం కాని రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. మరి మయాంక్ సాధించిన ఆ రికార్డు ఏంటి?

లక్నో-ఆర్సీబీ మ్యాచ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు లక్నో పేస్ గన్ మయాంక్ యాదవ్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో క్రమం తప్పకుండా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ.. బ్యాటర్ల పాలిట సింహ స్వప్నంలా మారాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 155 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి ఈ ఐపీఎల్ సీజన్ లోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటుగా మరో అరుదైన ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో తొలి రెండు మ్యాచ్ ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

Mayank yadav

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 16 మంది ఆటగాళ్లు తమ ఫస్ట్ మ్యాచ్ ల్లో మాత్రమే ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్స్ అందుకున్నారు. కానీ మయాంక్ ఒక్కడే తొలి రెండు మ్యాచ్ ల్లో ఈ అవార్డును అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ తో అరంగేట్రం చేసిన మయాంక్ 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక లేటెస్ట్ గా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో మరింతగా చెలరేగి 4 ఓవర్లలో కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చి.. 3 కీలక వికెట్లను తీశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో హేమాహేమీలు, దిగ్గజాలు సాధించలేని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు మయాంక్. ఇదిలా ఉండగా.. టీమిండియాకు ఆడటమే తన ధ్యేయమని, దేశం కోసం ఆడటం తన లక్ష్యమని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు మయాంక్. మరి నిప్పులు చెరిగే బంతులతో రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్న మయాంక్ యాదవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Virat Kohli: RCB ఓటమి తరువాత సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు! కోహ్లీకి చేతకాదంటూ!