iDreamPost
android-app
ios-app

ఐపీఎల్​కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై కేవలం..!

  • Published Mar 15, 2024 | 3:18 PM Updated Updated Mar 15, 2024 | 3:18 PM

ఐపీఎల్​కు వారం ముందు ఓ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి అనూహ్య నిర్ణయంతో అభిమానులు షాకయ్యారు.

ఐపీఎల్​కు వారం ముందు ఓ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి అనూహ్య నిర్ణయంతో అభిమానులు షాకయ్యారు.

  • Published Mar 15, 2024 | 3:18 PMUpdated Mar 15, 2024 | 3:18 PM
ఐపీఎల్​కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై కేవలం..!

రిటైర్మెంట్ అనేది ఏ ఆటగాడి జీవితంలోనైనా జరిగేదే. ఈ గేమ్, ఆ గేమ్ అనే సంబంధం లేదు.. ఏ ఆటలోనైనా ఇది కామనే. ప్లేయర్లు కెరీర్ ఆఖర్లో రిటైర్మెంట్ ఇస్తే అభిమానులు, ప్రేక్షకులు బాగా ఎమోషనల్ అవుతారు. అన్ని రోజులు తమ ఆటతీరుతో అందరి మనసుల్ని దోచుకున్న వాళ్ల ఆటను ఇక మీదట చూడలేమని బాధపడతారు. అయితే కెరీర్ మధ్యలోనే ఎవరైనా ఆటకు గుడ్​బై చెబితే మాత్రం అంతా షాక్ అవుతారు. ఇప్పుడో స్టార్ క్రికెటర్ విషయంలో ఇలాగే జరిగింది. కెరీర్​లో దూసుకుపోతున్న టైమ్​లో ఓ వరల్డ్ కప్ హీరో గేమ్​ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు.. ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్​మన్ మాథ్యూ వేడ్. తాజాగా అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.

టెస్టు ఫార్మాట్‌ నుంచి తాను వైదొలుగుతున్నానని మాథ్యూ వేడ్ వెల్లడించాడు. ఇక మీదట లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్​లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. ‘లాంగ్ ఫార్మాట్​లో ఎదురయ్యే ఛాలెంజెస్​ను ఎదుర్కోవడాన్ని ఎంతగానో ఆస్వాదించా. వైట్​బాల్ క్రికెట్​లో కంటిన్యూ అయినా.. బ్యాగీ గ్రీన్​తో దేశం తరఫున బరిలోకి దిగడమే నా కెరీర్​లో ఎప్పుడూ హైలైట్​గా నిలుస్తుంది. ఆస్ట్రేలియా తరఫున ఆడటం ఇంటర్నేషనల్ కెరీర్​లో ఎంతో స్పెషల్​గా భావిస్తా’ అని రిటైర్మెంట్​ సందర్భంగా ఎమోషనల్ స్టేట్​మెంట్ ఇచ్చాడు వేడ్. ఇక, ది షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్​లో టాస్మానియా-వెస్టర్న్ ఆస్ట్రేలియాకు మధ్య మార్చి 21వ తేదీన స్టార్ట్ కానున్న ఫైనల్ మ్యాచ్ రెడ్ బాల్ క్రికెట్​లో తనకు చివరిదని వేడ్ పేర్కొన్నాడు. ఇక, వేడ్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. 2012లో అతడు టెస్ట్ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. 36 టెస్టులు ఆడిన అతడు.. 1,613 పరుగులు చేశాడు.

Mathew Wade

లాంగ్ ఫార్మాట్​లో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు బాదాడు వేడ్. హయ్యెస్ట్ స్కోరు 117. అలెక్స్ క్యారీ రాకతో అతడికి ఛాన్సులు తగ్గాయి. భారత్​తో జరిగిన చరిత్రాత్మక గాబా టెస్టులో ఆఖరిగా బరిలోకి దిగాడు వేడ్. ఆ తర్వాత రెడ్ బాల్ క్రికెట్​లో అతడు ఆడలేదు. టెస్టుల్లో కంటే లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్​లో వేడ్​కు మంచి రికార్డులు ఉన్నాయి. టీ20 ఫార్మాట్​లో ఫినిషర్​గా అతడికి ముద్ర పడింది. 2021లో జరిగిన టీ20 ప్రపంచ కప్​ను ఆసీస్ నెగ్గడంలో వేడ్​దే కీలక పాత్ర. పాకిస్థాన్​తో సెమీస్ మ్యాచ్​లో అతడు కేవలం 17 బంతుల్లోనే 41 పరుగులు చేసి టీమ్​ను ఫైనల్​కు చేర్చాడు. ఐపీఎల్​లో గుజరాత్ టైటాన్స్​కు ఆడుతున్న అతడు తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నాడు. 36 ఏళ్ల వేడ్ టీ20 వరల్డ్ కప్-2024లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు, ఫస్ట్ క్లాస్​ క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు. మరి.. వేడ్ రిటైర్మెంట్ నిర్ణయంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.