Nidhan
బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్‌ను బిగ్‌బాస్ విన్నర్ వెనక్కి పంపాడు. కానీ ఉన్నంత సేపు మాస్టర్ తన మార్క్ చూపించాడు. అసలు ఇదంతా ఏ మ్యాచ్‌లో జరిగింది? సచిన్‌ను ఔట్ చేసిందెవరో ఇప్పుడు చూద్దాం..
బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్‌ను బిగ్‌బాస్ విన్నర్ వెనక్కి పంపాడు. కానీ ఉన్నంత సేపు మాస్టర్ తన మార్క్ చూపించాడు. అసలు ఇదంతా ఏ మ్యాచ్‌లో జరిగింది? సచిన్‌ను ఔట్ చేసిందెవరో ఇప్పుడు చూద్దాం..
Nidhan
టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్‌కు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా మంచి ఫిట్నెస్తో యంగ్‌గా కనిపిస్తున్నాడు సచిన్. అప్పుడప్పుడూ మాజీ క్రికెటర్స్‌తో కలసి పలుమార్లు గ్రౌండ్లోకి దిగి ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. తాజాగా మరోమారు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాడు మాస్టర్ బ్లాస్టర్. ఇండియన్ స్ట్రీట్ లీగ్ (ఐఎస్పీఎల్) 2024లో భాగంగా సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని మాస్టర్స్ ఎలెవన్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ కెప్టెన్సీలోని ఖిలాడీ ఎలెవన్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో సచిన్ టీమ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఆయన ఓ కమెడియన్ చేతిలో ఔట్ అయ్యాడు.
హిందీ బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫారుకీ చేతిలో ఔట్ అయ్యాడు సచిన్ (30). కశ్మీర్‌కు చెందిన దివ్యాంగ క్రికెటర్ ఆమిర్ (3)తో కలసి ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్. తన జెర్సీని ఆమిర్‌కు ఇచ్చి, అతడి టీషర్ట్‌ను సచిన్ ధరించడం విశేషం. ఈ ఇద్దరూ కలసి ఫస్ట్ వికెట్‌కు 37 పరుగులు జోడించారు. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప బౌలింగ్‌లో ఆమిర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం కొద్ది సేపటికే మాస్టర్ కూడా ఔట్ అయ్యాడు. 16 బంతుల్లో 30 పరుగులు చేసిన సచిన్.. ప్రత్యర్థి బౌలర్లందర్నీ ఉతికి ఆరేశాడు. బౌండరీలు, సిక్సుల రూపంలోనే పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బిగ్‌బాస్ విన్నర్, స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూకీ బౌలింగ్‌లో ఆయన పెవిలియన్‌కు చేరుకున్నాడు.
మునావర్ ఆఫ్ వికెట్ వికెట్ మీదుగా వేసిన డెలివరీని ఆన్ సైడ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు సచిన్. కానీ బాల్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో అక్కడే గాల్లోకి లేచింది. కీపర్ నమన్ ఓజా దాన్ని అందుకున్నాడు. దీంతో కమెడియన్ మునావర్ సంబురాలు చేసుకున్నాడు. మాస్టర్ వికెట్ దక్కడంతో ఎగిరి గంతేశాడు. యూసఫ్ పఠాన్ (21), బిన్నీ (18) రాణించడంతో ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సచిన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లకు 95 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఖిలాడీ ఎలెవన్ 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులే చేయగలిగింది. ఆ టీమ్‌లో ఇర్ఫాన్ పఠాన్ (8 బంతుల్లో 32 నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగినా తన జట్టును గెలిపించలేకపోయాడు. సచిన్ వికెట్ తీసిన మునావర్ బ్యాట్‌తోనూ 26 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
ఇదీ చదవండి: పంత్‌కి KGF రేంజ్ ఎలివేషన్! రోహిత్ మాటలకి గూస్ బంప్స్ పక్కా!
#MunawarFaruqui takes wicket of Great #SachinTendulkar 😂pic.twitter.com/9tXUTw9dGH
— The Khabri (@TheKhabriTweets) March 6, 2024