iDreamPost

పక్కా కమర్షియల్ 3 రోజుల కలెక్షన్లు

పక్కా కమర్షియల్ 3 రోజుల కలెక్షన్లు

మొన్న శుక్రవారం విడుదలైన పక్కా కమర్షియల్ మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. టాక్ రివ్యూస్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో కలెక్షన్లు కూడా భారీగా లేవు. పోటీగా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోయినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో కమర్షియల్ టీమ్ సక్సెస్ కాలేకపోతోంది. చాలా చోట్ల వీకెండ్ సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడలేదు. ఆక్యుపెన్సీ పర్లేదు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే ఈ కాంబోకు రావాల్సిన రెస్పాన్స్ కనిపించడం లేదు. మంచి రోజులు వచ్చాయితో ఆ మధ్య ఫ్లాప్ చవిచూసిన మారుతీకి ఇప్పుడీ పక్కా కమర్షియల్ కూడా పక్కాగా అదే రూట్ పట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఏదైనా అద్భుతం జరిగితే తప్ప

ఇక లెక్కల విషయానికి వస్తే మూడు రోజులకు గాను ఈ సినిమా 6 కోట్ల 50 లక్షల దాకా షేర్ తెచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. థియేట్రికల్ బిజినెస్ జరిగింది 16 కోట్లకు. అంటే ఇంకా 9 కోట్లకు పైగానే రావాలి. ఇప్పుడీ టాక్ తో అంత మొత్తం రాబట్టడం కష్టం. యావరేజ్ బాగానే ఉందన్నా సరే అంటే సుందరానికి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ దక్కిందో చూస్తున్నాం. అలాంటిది పక్కా కమర్షియల్ రాబోయే రోజుల్లో ఏదో మేజిక్ చేసేస్తుందని ఎక్స్ పెక్ట్ చేయలేం. అన్ని ఏరియాలతో పోల్చుకుంటే నైజామ్ లో అత్యధికంగా 1 కోటి 72 లక్షల షేర్ రాబట్టిన పక్కా కమర్షియల్ సీడెడ్ లో 85 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 90 లక్షలు, గుంటూరు 44 లక్షలు, కృష్ణా 40 లక్షలు తెచ్చింది.

ఉత్తరాంధ్రలో 85 లక్షలు, కర్ణాటకతో కలిపి రెస్ట్ అఫ్ ఇండియా 25 లక్షలు, ఓవర్సీస్ 71 లక్షలు వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అంత సులభమయ్యేలా కనిపించడం లేదు. ఈ వారం హ్యాపీ బర్త్ డే, కడువా లాంటి ఒకటి రెండు తప్ప చెప్పుకోదగ్గ రిలీజులేవి లేవు. దాన్ని పక్క కమర్షియల్ ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి. 2014 లౌక్యం సక్సెస్ తర్వాత ఆ స్థాయి హిట్టు లేక సతమతమవుతున్న గోపీచంద్ కు పక్కా కమర్షియల్ సైతం ఆశించిన బ్రేక్ ఇచ్చే ఛాన్స్ తగ్గిపోతోంది. నెక్స్ట్ శ్రీవాస్ దర్శకత్వంలో చేయబోయే మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో . రిలీజ్ తర్వాత గోపీచంద్ అసలు బయటే కనిపించడం లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి