iDreamPost

OTTలోకి గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 26, 2024 | 10:32 AMUpdated Mar 26, 2024 | 10:32 AM

మాచో స్టార్ గోపీచంద్ తాజాగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఒరియెంటెడ్ చిత్రం భీమా. అయితే ఈ సినిమా గోపిచంద్ కు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను ఇవ్వలేకపోవడంతో పాటు థియేటర్లలో భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

మాచో స్టార్ గోపీచంద్ తాజాగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఒరియెంటెడ్ చిత్రం భీమా. అయితే ఈ సినిమా గోపిచంద్ కు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను ఇవ్వలేకపోవడంతో పాటు థియేటర్లలో భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Mar 26, 2024 | 10:32 AMUpdated Mar 26, 2024 | 10:32 AM
OTTలోకి గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఒరియెంటెడ్ చిత్రం ‘భీమా’. ఈ సినిమాను కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించగా.. ఇందులో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ లు హీరోయిన్ గా నటించారు. ఇక భీమా సినిమాకు సంబంధించి ట్రైలర్, టీజ‌ర్స్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా అందరికి భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఈనెల అనగా మార్చి 8న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేశారు. కానీ, ఆశించినన స్థాయిలో గోపిచంద్ భీమా సినిమా ప్రేక్షకులను ఆకట్టకోలేకపోయింది. పైగా ఔట్‌డేటెడ్ స్టోరీతో తెర‌కెక్కిన సినిమా అంటూ ఆడియెన్స్ దగ్గర నుంచి ఈ సినిమా పై దారుణంగా నెగిటివి కామెంట్స్ వచ్చాయి.ఇక థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

మాచో స్టార్ గోపీచంద్ తాజాగా ‘భీమా’ చిత్రంతో ప్రేక్షకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గోపిచంద్ కు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను ఇవ్వలేకపోయింది. పైగా వరుస ఫ్లాప్ లతో నిలుస్తున్న ఈ స్టార్ హీరోకు భీమా సినిమాతో మరో ఫ్లాప్ తన ఖాతాలో చేరిందనే చెప్పవచ్చు. ఇక ఎంతో గ్రాండ్ గా థియేటర్లలో ఈనెల 8న భీమా సినిమా విడుదల చేశారు. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఆ తర్వాత ఓ మోస్తరుగా థియేటర్లలో అలరించిన ఈ సినిమాకు ఆడియోన్స్ నుంచి విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే థియేటర్లలో డిజాస్టర్ గా నెగిటివిటి కామెంట్స్ తో నిలిచిన ఈ సినిమా గత కొన్ని రోజులుగా ఓటీటీలో అలరించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే..భీమా మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న‌ విషయం తెలిసిందే. ఇక ఎప్పుడెప్పుడు గోపిచంద్ భీమా ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో.. తాజాగా ఈ మూవీ ఏప్రిల్ 5న ఓటీటీలో రిలీజ్ చేయునున్నట్లు స‌మాచారం అందింది. దీంతో పాటు ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో రిలీజ్ కాబోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అధికారక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో రానున్న‌ట్లు తెలిసింది.

Bhimaa into OTT

ఇక భీమా సినిమా థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన మొదట.. టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో భీమా ప్రీ రిలీజ్ బిజినెస్ 12 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. అయితే ఆ క్రేజ్ కారణంగానే.. తొలిరోజు భీమా మూడు కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఆ త‌ర్వాత డీలా ప‌డింది. కాగా, ఓవ‌రాల్‌గా థియేట్రిక‌ల్ ర‌న్‌లో ఏడు కోట్ల లోపు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. ఇక భీమా సినిమాలో సినిమాలో గోపిచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ లతో పాటు ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఈ చిత్రానికిశ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై.. కెకె రాధామోహన్ నిర్మించగా..కేజీఎఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ సంగీతాన్ని అందించారు.

ఇక భీమా సినిమా కథ విషయానికొస్తే.. మ‌హేంద్ర‌గిరిలో భ‌వానీ (ముఖేష్ రిషి) ముఠా ఎన్నో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటుంది.  అయితే ఆ ప్రాంతానికి భీమా (గోపీచంద్‌) పోలీస్ ఆఫీస‌ర్‌గా వ‌స్తాడు. అక్కడ భవానీ ముఠా సాగిస్తోన్న అన్యాయాల‌ను భీమా ఎలా అడ్డుకున్నాడు. భ‌వానీ గ్యాంగ్ మూసిన వేసిన ప‌ర‌శురామ క్షేత్రాన్ని తెరిపించే క్ర‌మంలో భీమాకు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. అయితే ఈ సినిమాలో గోపీచంద్ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించాడు. మరి, త్వరలో ఓటీటీలోకి రానున్న గోపిచంద్ భీమా సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి