iDreamPost

OTTలోకి సంపూ సినిమా.. చెప్పిన టైమ్ కంటే ముందే..!

సంపూర్ణేష్ బాబు నటించిన మార్ఠిన్ లూథర్ కింగ్ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని ఆ ఓటీటీ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇంతకు ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

సంపూర్ణేష్ బాబు నటించిన మార్ఠిన్ లూథర్ కింగ్ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని ఆ ఓటీటీ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇంతకు ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

OTTలోకి సంపూ సినిమా.. చెప్పిన టైమ్ కంటే ముందే..!

హృదయం కాలేయం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు. ఈ మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అన్ని వయసుల వారిని ఆకట్టుకుని సరికొత్త రికార్డ్ ను నెలకోల్పింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. దీంతో ఈ మూవీతో సంపూ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సరికొత్త కథనంతో వచ్చి మొదటి చిత్రంతోనే ఆయన మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు పెసరట్టు, కొబ్బరి మట్ట, హాఫ్ స్టోరీస్ వంటి చిత్రాల్లో నటించాడు. కానీ, ఆ సినిమాలు ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇదిలా ఉంటే.. 2020లో తమిళంలో విడుదలైన చిత్రం మండేలా. ఈ చిత్రం అక్కడ మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇదే సినిమాను మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఇందులో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించగా వీకే నరేష్ , శరణ్య ప్రసాద్, వెంకటేష్ మహా తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ మూవీని నిర్మాత ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్ లలో రిలీజ్ అయింది. కానీ, ఈ మూవీ ఎందుకో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఒక కొత్త కథనంతో సాగినా.. ప్రేక్షకులను మాత్రం మెప్పించలేక పోవడం విశేషం.

అయితే ఈ సినిమాను ఓటీటీలోకి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. కానీ, చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రానున్నట్లు తాజాగా ఓటీటీ సంస్థ ప్రకటించింది. సోనీ లీవ్స్ ఈ మూవీ డిజిటల్ హక్కలను సాధించుకుంది. ఇక నవంబర్ 29 నుంచి మార్టిన్ లూథర్ కింగ్ చిత్రం సోనీ లీవ్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని సోనీ లీవ్స్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. కాగా, ఈ మూవీ థియేటర్ లో ఎలాగో ఆకట్టుకోలేకపోయింది. కనీసం ఓటీటీలోనైనా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి