iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్‌కు పండగే.. మార్చిలో ఎన్ని సినిమాలు రిలీజ్‌ అంటే!

  • Published Feb 24, 2024 | 9:01 PMUpdated Feb 24, 2024 | 9:01 PM

ఈ ఏడాది సినీ ప్రియులను అలరించడానికి ఎన్నో సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఇప్పటికి కొన్ని సినిమాలు విడుదల కాగా.. ఇక రాబోయే మార్చి నెలలో విడుదలకు సిద్ధంగా ఏకంగా 14 చిత్రాలు ఉన్నాయట.

ఈ ఏడాది సినీ ప్రియులను అలరించడానికి ఎన్నో సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఇప్పటికి కొన్ని సినిమాలు విడుదల కాగా.. ఇక రాబోయే మార్చి నెలలో విడుదలకు సిద్ధంగా ఏకంగా 14 చిత్రాలు ఉన్నాయట.

  • Published Feb 24, 2024 | 9:01 PMUpdated Feb 24, 2024 | 9:01 PM
మూవీ లవర్స్‌కు పండగే.. మార్చిలో ఎన్ని సినిమాలు రిలీజ్‌ అంటే!

ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి భారీగా సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాలలో హనుమాన్ చిత్రానికి భారీ సక్సెస్ లభించింది. అలా జనవరి నెల మొత్తానికి హనుమాన్ ఏ టాప్ వన్ లో నిలిచింది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటివరకు కూడా ఈ సినిమా గురించి తరచూ ఏవో ఒక వార్తలు వింటూనే వస్తున్నాం. ఇక ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి కానీ .. అంత భారీ సక్సెస్ ను సాధించిన టాక్ మాత్రం రాలేదు. చిన్న చిన్న సినిమాలుగా వచ్చినవి కూడా పాజిటివ్ టాక్ తోనే సరిపెట్టుకున్నాయి. ఇక మార్చిలో థియేటర్ లో సందడి చేయడానికి మరిన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి. వారి వివరాలు తెలుసుకుందాం.

మార్చి నెల మొత్తం మీద సుమారు 14 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో కొన్ని స్టార్ హీరోల చిత్రాలతో పాటు.. చిన్న చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. అలానే అన్ని జోనర్స్ కు తగిన విధంగా .. ఈ సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. వాటిలో ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్, పోస్టర్స్ తో .. కొన్ని సినిమాల పైన ప్రేక్షకులను ఓ మేరకు అంచనాలు నెలకొన్నాయి. అయితే, మార్చి నెలలో విడుదల కాబోయే సినిమాల ఇప్పటికే పాజిటివ్ టాక్ క్రియేట్ అయింది. ఇక వీటిలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటుంది అనేది.. సినిమాలు విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సి ఉంది. మార్చి నెలలో విడుదల కాబోయే సినిమాల జాబితా ఇలా ఉంది.

1) మార్చి 01: ఆపరేషన్ వాలంటైన్
2) మార్చి 01: చారి 111
3) మార్చి 01: బూతద్దం భాస్కర్ నారాయణ
4) మార్చి 01: వ్యూహం
5) మార్చి 08: గామి
6) మార్చి 08: భీమా
7) మార్చి 08: శపథం
8) మార్చి 15: తంత్ర
9) మార్చి 15: లైన్ మెన్
10) మార్చి 22: ఓం భీమ్ బుష్
11) మార్చి 22: ఆ ఒక్కటి అడక్కు
12) మార్చి 22: రోటీ కపడా రొమాన్స్
13) మార్చి 28: ఆడు జీవితం (డబ్బింగ్)
14) మార్చి 29: టిల్లు స్క్వేర్

మరి, మార్చి నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయి వేచి చూడాలి. అయితే, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సినిమాలకు మరింత క్రేజ్ పెరుగుతోంది. జోనర్ తో సంబంధం లేకుండా కథను బట్టీ ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకులు కూడా వినూత్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి, మార్చి నెలలో ఏ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియాజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి