iDreamPost

మణిపూర్ తరహాలో ఘటన.. బీజేపీ అభ్యర్థిని నగ్నంగా నిల్చోబెట్టారు..!

మణిపూర్ తరహాలో ఘటన.. బీజేపీ అభ్యర్థిని నగ్నంగా నిల్చోబెట్టారు..!

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాజ్యసభ దద్దరిల్లింది. రెండు జాతుల మధ్య వైరం కారణం కొన్నినెలల నుంచి మణిపూర్ మండుతుంది. ఈక్రమంలో అనేక ఘోరాలు, దారుణలు చోటుచేసుకున్నాయి. తాజాగా అత్యంత ఘోరమైన అమానుషమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను మరో వర్గానికి చెందిన వ్యక్తులు నగ్నం చేసి..ఊరేగిస్తూ గ్రామంలోకి తీసుకెళ్లారు. ఈ ఘటనకు కారకుడైన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాలిబన్ల కంటే ఘోరంగా ఉన్నారంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా స్పందించారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిని శిక్షంచాలని, అలానే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని ఆమె ఆరోపించారు.

ఆమె వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ నేత ఒకరు.. ఆ రాష్ట్రంలో జరిగిన ఓ దారుణం గురించి ట్విట్ చేశారు. ఆ ట్వీట్ కి సీఎం మమతా బెనర్జీని కూడా ట్యాగ్ చేశారు. ఇక అందులో ఆయన తెలిపిన ప్రకారం.. బెంగాల్ రాష్ట్రంలో కూడా అలాంటి ఘోరమైన ఘటన జరిగితే మీరేం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఓ మహిళా అభ్యర్థిని.. తనను నగ్నంగా నిల్చొబెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. ఆమె ఎఫ్ఐఆర్ లో తెలిపిన వివరాల ప్రకారం…హౌరా జిల్లా దక్షిన్ పంచ్లలో జూలై 8న పంచాయతీ ఎన్నికల జరిగాయి. ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలు పోలీంగ్ బూత్  లో తన బట్టలిప్పి నగ్నంగా నిల్చోబెట్టారని బీజేపీ మహిళా అభ్యర్థి ఆరోపించారు.

ఇక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమెపై జరిగిన దారుణలను పేర్కొంది. తన ఛాతి, తలపై కర్రలతో కొట్టి.. పొలింగ్ బూత్  నుంచి బయటకు గెంటేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి  చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రాకపోవడం గమన్హారం. బెంగాల్ రాష్ట్రంలో మీరు సీఎంగా విఫలమయ్యారని అమిత్ మాల్వియా ఫైర్ అయ్యారు.ఏది ఏమైనప్పటికి  మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరగడం దారుణం. ఇలా మహిళలపై జరుగుతున్న దారుణ మారణకాండలకు ఎవరు బాధ్యులు? మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండిఆమెకు భర్త కన్న ప్రియుడే ముఖ్యం.. ఎంతకు తెగించిందంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి