iDreamPost

పొన్నియన్ సెల్వన్ @ 200 కోట్లు

పొన్నియన్ సెల్వన్ @ 200 కోట్లు

మొన్న శుక్రవారం విడుదలైన మణిరత్నం విజువల్ గ్రాండియర్ పొన్నియన్ సెల్వన్ 1 తమిళ వెర్షన్ దూసుకుపోతోంది. కేవలం మూడే రోజుల్లో 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఆ స్థాయిలో మిగిలిన భాషల్లో దూకుడు లేనప్పటికీ అక్కడా డీసెంట్ రన్ తో పరుగులు పెడుతోంది. ముఖ్యంగా తెలుగులో అతి తక్కువ ధరకు ఇవ్వడం కలిసి వస్తోంది. కేవలం 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగడంతో ఆల్రెడీ వచ్చేసిన 7 కోట్ల 63 లక్షలను చూసుకుంటే ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశించడం అంత కష్టమేమీ కాదనిపిస్తోంది. కాకపోతే బుధవారమే మూడు టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ రానుండటంతో ఆ ప్రభావం గట్టిగానే పడనుంది.

నైజామ్ లోనే అత్యధికంగా 4 కోట్ల 20 లక్షలు రాబట్టిన పీఎస్ 1 సీడెడ్ లో 73 లక్షలు లాగేసింది. ఇక వరల్డ్ వైడ్ సంగతి చూస్తే తమిళనాడు 73 కోట్ల 52 లక్షలు, తెలుగు రాష్ట్రాల నుంచి 14 కోట్ల 39 లక్షలు, కర్ణాటక 13 కోట్ల 70 లక్షలు, కేరళ 9 కోట్ల 75 లక్షలు, రెస్ట్ అఫ్ ఇండియా 9 కోట్ల 20 లక్షలు, ఓవర్సీస్ ఏకంగా 87 కోట్ల 80 లక్షల దాకా వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. అంటే గ్రాస్ ప్రకారం చూసుకుంటే ఇది 208 కోట్లకు పైమాటే. షేర్ అయితే 108 కోట్ల దాకా వస్తుంది. మొత్తానికి అన్ని వెర్షన్లు కలిపి మూడు రోజులకే సెంచరీ మార్క్ సాధించడం అంటే చిన్న విషయం కాదు. కంటెంట్ అందరినీ మెప్పించి ఉంటే రన్ ఇంకో లెవెల్ లో ఉండేది.

హిందీలో మాత్రం పొన్నియన్ సెల్వన్ ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. విక్రమ్ వేదాకు సైతం ఏమంత బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో పిఎస్ 1 ఫెయిలయ్యింది. బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాగా తమకు పొన్నియన్ సెల్వన్ అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రన్ తెచ్చుకుంటుందని ఆశ పడిన కోలీవుడ్ ఫ్యాన్స్ కు నిరాశ మిగిలినట్టే. మణిరత్నం ఫ్లాట్ నెరేషన్ ఆరవ తంబీలకు నచ్చినట్టుగా మిగిలిన ప్రాంతాల్లో కనెక్ట్ కావడం లేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. ఇంకా చెప్పాల్సిన కథ చాలా ఉంది కాబట్టి సెకండ్ పార్ట్ ఏమైనా అద్భుతాలు చేస్తుందేమో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి