iDreamPost

ఓలా- ఉబెర్లకు షాకిస్తూ.. “మన యాత్రి” యాప్ లాంఛ్ చేసిన ప్రభుత్వం!

Mana Yatri App Launch at Hyderabad: దేశంలో ఇప్పుడు ప్రయాణాలు చాలా సులభతరం అయ్యాయి.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏ వాహనం అయినా మనముందుకు వచ్చేస్తున్నాయి.. అదే సమయంలో వసూళ్లు కూడా బాగానే చేస్తున్నాయి.

Mana Yatri App Launch at Hyderabad: దేశంలో ఇప్పుడు ప్రయాణాలు చాలా సులభతరం అయ్యాయి.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏ వాహనం అయినా మనముందుకు వచ్చేస్తున్నాయి.. అదే సమయంలో వసూళ్లు కూడా బాగానే చేస్తున్నాయి.

ఓలా- ఉబెర్లకు షాకిస్తూ.. “మన యాత్రి” యాప్ లాంఛ్ చేసిన ప్రభుత్వం!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఆరు గ్యారెంటీ పథకాలపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ భారీగా పెరిగిపోయింది. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల తాము ఎంతగానో నష్టపోతున్నామని ఆటో, క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాక్సీవాలాలకు రాష్ట్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో చాలా మంది ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే వెంటనే ఊబర్, ఓలా బుక్ చేస్తున్నారు. అలా బుక్ చేసిన తర్వాత వారితో ఎలాంటి బేరాలు ఆడే ఛాన్స్ లేకుండా పోతుంది. ఒకప్పుడు ఆటోలో ప్రయాణించేవారు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే బేరం ఆడి తమకు గిట్టుబాటు అయితే వెళ్లే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఊబర్, ఓలా చేస్తే వారు వేసే ఛార్జీలు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. వినియోగదారుడికి- క్యాబ్ డ్రైవర్లకు మధ్య అనుసంధాన కర్తగా ఉంటున్న ఈ సంస్థలు ఇద్దరి నుంచి కమిషన్ రూపంలో బాగానే వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్ లైన్ లో బుక్ చేసి ప్రయాణం చేయడం వినియోగదారుడికి అలవాటుగా మారింది. నగరంలో ఈ సంస్థలు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంస్థలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాత్రి సేవ యాప్ ని లాంఛనంగా ప్రారంభించింది.

డ్రైవర్లు సంపాదిస్తున్న దాంట్లో ఈ సంస్థలకు 20 – 30 శాతం కమిషన్ రూపంలో చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్లు. వీరి కష్టాలు తీర్చడం కోసం తెలంగాణ సర్కార్ టీ హబ్ తో కలిసి ‘మన యాత్రి’ పేరుతో ఓ ప్రత్యేక యాప్ ను తయారు చేసింది. ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఇకపై ఓలా, ఊబర్ లాంటి సంస్థలకు కమిషన్ చెల్లించకుండా నేరుగా వినియోగదారుల నుంచి డబ్బు పొందేందుకు ఈ యాప్ ప్రారంభించారు. మన యాత్రి యాప్ తో వినియోగదారులకు భారం తగ్గడమే కాదు.. డ్రైవర్లకు కూడా ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే బెంగుళూర్, కోల్‌కొతా, కొచ్చిన్, చెన్నై లాంటి నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్ అటు వినియోగదారులకు, ఇటు డ్రైవర్లకు ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉండేలా తయారు చేశామని.. ఇప్పటి వరకు మంచి రిజల్ట్ వస్తుందని టీ హబ్ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. 

ఈ యాప్ వల్ల కస్టమర్లు ఎలా లాభం పొందుతారో తెలుసుకుందాం.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మినీ కారును ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి బుక్ చేస్తే ఊబర్ లో రూ.699, ఓలాలో రూ.694 వరకు ఛార్జీ వసూలు చేస్తారు. అయితే ‘మన యాత్రి’లో రూ.469 మాత్రమే వసూలు చేస్తారు.. అంటే రూ.225 వరకు తేడా ఉంటుంది. మిగతా సర్వీసుల్లాగే ఈ యాప్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. కస్టమర్లు నగదు రూపంలో కానీ,యూపీఐ పేమెంట్స్ తో కానీ చేసుకోవచ్చు. గతంలో ఓలా, ఊబర్ సంస్థలు తీసుకునే కమిషన్లు చూస్తే చాలా బాధ వేసేదని.. కష్టపడ్డ సొమ్ము కమిషన్ల రూపంలో పోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉండేదని డ్రైవర్లు చెప్పారు. ఈ యాప్ ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాదు.. ఆర్థికంగా కస్టమర్లకు కూడా చాలా సేవ్ అవుతుందని అంటున్నారు. తమకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యాప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి