iDreamPost

ఈ ఏరియాలో గజం స్థలం రూ.9,500.. మిడిల్ క్లాస్ వారికిదే మంచి అవకాశం!

తెలంగాణలో స్థలాలు కొనాలి అని మీరు భావిస్తున్నట్లైతే కనుక ఈ ఏరియా బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా తక్కువ ధరకే స్థలాలు దొరుకుతున్నాయి. పది లక్షల లోపే 100 గజాల స్థలం అందుబాటులో ఉన్నాయి. 

తెలంగాణలో స్థలాలు కొనాలి అని మీరు భావిస్తున్నట్లైతే కనుక ఈ ఏరియా బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా తక్కువ ధరకే స్థలాలు దొరుకుతున్నాయి. పది లక్షల లోపే 100 గజాల స్థలం అందుబాటులో ఉన్నాయి. 

ఈ ఏరియాలో గజం స్థలం రూ.9,500.. మిడిల్ క్లాస్ వారికిదే మంచి అవకాశం!

యాదగిరి గుట్ట భువనగిరి జిల్లాలో ఉంది. ఫ్యూచర్ లో అభివృద్ధి చెందడానికి రెడీగా ఉంది. తెలంగాణలోని ప్రధాన నగరాలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సులువుగా చేరుకునేలా రవాణా మార్గాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకు యాదగిరి గుట్ట పెద్ద పీట వేసింది. టెంపుల్ సిటీగా పేరొందిన యాదగిరి గుట్టలో లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉంది. యాదాద్రి భువనగిరి ప్రాంతంలో యాదగిరిగుట్ట పీస్ ఫుల్ ప్రాంతంగా ఉండడం వల్ల ఇన్వెస్టర్లు.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ వనరులు కూడా పుష్కలంగా దొరుకుతున్నందున పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. ఇది హైవే వెంబడి హైదరాబాద్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం ప్రణాళిక దశలో ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు గణనీయంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 

వెంచర్లు, ప్రాజెక్ట్ లు:

ఈ ప్రాంతంలో అనేక వెంచర్లు, ప్రాజెక్ట్ లు రానున్నాయి. ఫ్యూచర్ లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలు ఈ ప్రాంతానికి గణనీయ సంఖ్యలో చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ భూములపై వనరులను పెట్టుబడిగా పెట్టింది. గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ స్థలాల మీద పెట్టుబడి పెట్టిన వాళ్లకి గణనీయమైన లాభాలను ఆశించవచ్చునని చెబుతున్నారు. చిన్న కుటుంబాలకు హైదరాబాద్ లో అంత త్వరగా ఇండ్ల స్థలాలు దొరకడం అనేది కష్టం. దాదాపు అన్నీ 2 బీహెచ్కే, 3 బీహెచ్కే ఇళ్లకు సరిపడా స్థలాలే ఉంటున్నాయి. 1 బీహెచ్కేకి సరిపడా స్థలం కొనుక్కుందామని అనుకున్నా దొరకని పరిస్థితి.

సరసమైన ధరలకే స్థలాలు:

యాదాద్రిలో ఆ పరిస్థితి లేదు. మిడిల్ క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకుని చిన్న కుటుంబాలకు, సింగిల్ కుటుంబాలకు ప్లాట్స్ ని సిద్ధం చేస్తున్నారు. ప్రశాంతంగా జీవించాలని భావించేవారికి ఈ యాదగిరిగుట్ట చాలా బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఇన్వెస్ట్ మెంట్ కోణంలో చూసినా గానీ ఫ్యూచర్ లో ఇక్కడ వచ్చే ప్రాజెక్టులు, ఇన్వెస్ట్ మెంట్లు కారణంగా ఇక్కడ స్థలాల రేట్లు భారీగా పెరుగుతాయని.. తద్వారా భారీ లాభాలు ఆశించవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు స్థలం రూ. 1050 గా ఉంది. అంటే గజం స్థలం రూ. 9,450గా ఉంది. 10 లక్షల లోపే 100 గజాల స్థలాన్ని సొంతం చేసుకోవచ్చు. 20 లక్షలు పెట్టుకుంటే 200 గజాల స్థలం వస్తుంది. ఇప్పుడు కొనుక్కుని పెట్టుకుంటే ఫ్యూచర్ లో మంచి లాభం వస్తుంది.   

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి