iDreamPost
android-app
ios-app

శ్రీలీల విషయంలో మహేష్ బాబు టెన్షన్! ఇది కదా సక్సెస్ అంటే!

  • Author Soma Sekhar Updated - 05:35 PM, Thu - 4 January 24
  • Author Soma Sekhar Updated - 05:35 PM, Thu - 4 January 24
శ్రీలీల విషయంలో మహేష్ బాబు టెన్షన్! ఇది కదా సక్సెస్ అంటే!

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ మెుత్తం జపం చేస్తోన్న పేరు. టాలీవుడ్ అంటే శ్రీలీల.. శ్రీలీల అంటే టాలీవుడ్ అనేంతలా సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ హీరో.. ఈ హీరో అనే తేడాలేకుండా వరుసపెట్టి అందరి హీరోలతో నటిస్తూ.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. అవకాశాల కోసం తిరిగే స్థాయి నుంచి తన డేట్స్ కోసం ప్రొడ్యూసర్స్ వేచి చూసే రేంజ్ కు ఎదిగిపోయింది ఈ బ్యూటీ. తాజాగా మహేష్ తో చేస్తున్న గుంటూరు కారం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ విషయాన్ని కన్ఫాం చేశాడు మహేష్. కాగా.. శ్రీలీల విషయంలో మహేష్ బాబుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. దీంతో శ్రీలీల ఫ్యాన్స్ ఇది కదా అసలు సక్సెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సక్సెస్ అంటే.. ఒక్కొక్కరు ఒక్కో డెఫినేషన్ ఇస్తారు. కానీ చాలా మంది ఇచ్చే ఒక డెఫినేషన్ ఉంది. అదేంటంటే? మనం అవకాశాల కోసం తిరిగిన చోటే.. మన కోసం చాలా మంది వేచి చూడటం. ప్రస్తుతం శ్రీలీల ఇదే రేంజ్ లో ఉంది. ఎక్కడైతే అవకాశాల కోసం తిరిగిందో.. అక్కడే ఆమె డేట్స్ కోసం ప్రొడ్యూసర్స్ పడిగాపులు కాస్తున్నారు. ఆమె డేట్స్ ఖాళీ లేవు అంటే మూవీని కొన్ని రోజులు ఆపడానికి కూడా సిద్దపడుతున్నారు అంటే.. ఆమె ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది. ఏ హీరోయిన్ అయినా ఈ రేంజ్ సక్సెస్ రావాలని కోరుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇదే రేంజ్ ను ఎంజాయ్ చేస్తోంది.

ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాల్లో ఒకటి ‘గుంటూరు కారం’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం. మహేష్ కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ మూవీ విషయంలో మహేష్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే? శ్రీలీల ప్రస్తుతం MBBS చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు పరీక్షలు ఉన్నందున నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిగా షూటింగ్ లకు బ్రేక్ ఇస్తుందట. దీంతో టైమ్ కి గుంటూరు కారం రిలీజ్ చేస్తాం అని ప్రకటించిన మూవీ టీమ్ కు కొత్త తలనొప్పి మెుదలైంది.

ఈ క్రమంలోనే ఇంత తక్కువ టైమ్ లో శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ అవుతాయా? మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుందా? అన్న టెన్షన్ గుంటూరు కారం మూవీ యూనిట్ లో మెుదలైంది. ప్రస్తుతం శ్రీలీల ఉన్న బిజీ షెడ్యూల్ లో రెండు నెలలు మూవీలకు బ్రేక్ ఇస్తే.. గుంటూరు కారం పరిస్థితి ఏంటి? అన్నది ప్రశ్నగా మారింది. కాగా.. ఓ హీరోయిన్ సినిమా రేంజ్ శాసించే స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ విషయం తెలిసిన శ్రీలీల ఫ్యాన్స్ ఇది కాదా అసలైన సక్సెస్ అంటూ.. ఫుల్ ఖుషి అవుతున్నారు.  మరి గుంటూరు కారం విషయంలో శ్రీలీల మహేష్ కు టెన్షన్ గా మారిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మహేశ్ బాబు-సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన మూవీ ఏంటో మీకు తెలుసా?

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet