iDreamPost
android-app
ios-app

Guntur Kaaram: గుంటూరు కారం నిలబడింది! బయ్యర్స్ బతికిపోయారు

  • Published Jan 17, 2024 | 1:14 PMUpdated Jan 17, 2024 | 1:14 PM

భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం సినిమా తొలి షో నుంచే నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. దాంతో బయ్యర్లు భయపడ్డారు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది సినిమా నిలబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం సినిమా తొలి షో నుంచే నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. దాంతో బయ్యర్లు భయపడ్డారు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది సినిమా నిలబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

  • Published Jan 17, 2024 | 1:14 PMUpdated Jan 17, 2024 | 1:14 PM
Guntur Kaaram: గుంటూరు కారం నిలబడింది! బయ్యర్స్ బతికిపోయారు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో.. సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు హీరోగా వచ్చిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలకు ముందు నుంచే సినిమా మీద అంచనాలు భారీ ఎత్తున పెరిగాయి. ట్రైలర్‌, పాటలు సినిమా మీద ఆసక్తిని మరింత పెంచగా.. భారీ ఎత్తున నిర్వహించిన ప్రమోషన్స్‌తో సినిమా మీద అంచనాలను ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. భారీ హైప్‌ నేపథ్యంలో జనవరి 12 గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజే సినిమా నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ స్టోరీ ఎలా ఉన్నా.. మహేశ్ బాబు వన్ మ్యాన్ షో అని, డ్యాన్స్ విషయంలో బాబు విశ్వరూపం చూపించాడని ప్రశంసలు కురిపించారు.

అయితే ఫస్ట్‌ డే గుంటూరు కారం సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌, టాక్‌ చూసి.. ఆ సినిమా డిజాస్టర్‌ అవుతుందని ఇండస్ట్రీ నిపుణులు ఊహించారు. మొదటి రోజు వచ్చిన టాక్‌ బయ్యర్స్‌ని విపరీతంగా భయపెట్టింది. చాలా మంది గుంటూరు కారం సినిమా రిజల్ట్‌ని అజ్ఞాతవాసితో పోల్చారు. దాంతో ఈ సినిమా పోతుంది అనుకున్నారు చాలా మంది. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. తొలి రోజే గుంటూరు కారం.. 94 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఆ తర్వాత రెండో రోజు 125 కోట్ల గ్రాస్, మూడో రోజు 164 కోట్ల గ్రాస్‌.. 4వ రోజు ముగిసే సమయానికి 182 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసి.. సినిమా మీద ట్రోల్స్, నెగిటివ్ ట్రెండ్ చేసిన వారికి గట్టి సమాధానం చెప్పింది. ఫ్యామిలీ ఆడియెన్స్, ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో గుంటూరు కారం సినిమా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.

అంతేకాక ఐదో రోజు కూడా గుంటూరు కారం సినిమా స్ట్రాంగ్ కలెక్షన్లను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల కలెక్షన్లు, ఇండియా వ్యాప్తంగా 1.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 27 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 95 కోట్లు, 193 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించేందుకు రెడీ అవుతుంది.

ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 132 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ 110 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. అంతేకాక సినిమా మీద ఎంత నెగిటీవ్‌ టాక్‌ వచ్చినా.. మహేష్‌ బాబుకి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం సినిమాకు బలంగా నిలివడమే కాక.. రమణగాడిని నిలబెట్టారు అంటున్నారు.

అదేవిధంగా సంక్రాంతి సెలవులు కూడా గుంటూరు కారం నిలబడటానికి మరో కారణం అయ్యాయి అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది. ఇక మిగిలిన చోట్ల కూడా సెకండ్ వీక్ స్ట్రాంగ్ నంబర్స్ రావాల్సి ఉంది అంటున్నారు ట్రేడ్‌ నిపుణులు. మొత్తానికి గుంటూరు కారం సినిమా నిలబడటంతో.. బయ్యర్స్‌ బతికిపోయారని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి