iDreamPost

చనిపోయిందని అందరినీ నమ్మించారు.. పాపం, ఇది నిజమే అనుకుని..!

చనిపోయిందని అందరినీ నమ్మించారు.. పాపం, ఇది నిజమే అనుకుని..!

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురు చనిపోక ముందే చనిపోయిందని అందరినీ నమ్మించాడు. ఆ తర్వాత జరిగిన ఘటనతో గ్రామస్తులు అంతా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఆమె తండ్రి కూతురు చనిపోకముందే చనిపోయిదని ఎందుకు నమ్మించాడు? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాలోని విరాసిపల్లికి చెందిన స్వాతి (15), ఆత్మకూరు మండలం మోట్లంపల్లికి చెందిన మహేష్ (19) అనే ఇద్దరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇదే విషయం ఇటీవల స్వాతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బుద్ది మార్చుకోవాలంటూ ఆ బాలికకు వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇంతటితో సరిపెట్టని ఈ బాలిక తండ్రి.. కూతురు ప్రియుడైన మహేష్ కు ఫోన్ చేసి.. మా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, దీని కారణం నువ్వే అంటూ కోప్పడ్డాడు. ఎలాగైనా నిన్ను చంపేస్తామంటూ బెదిరించారు.

ఇదంతా నిజమే అనుకున్న మహేష్.. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణవార్త తెలుసుకుని అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే ఈ విషయం స్వాతికి తెలియడంతో ఆ బాలిక తట్టుకోలేకపోయింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలిక సైతం ఫ్యానుకి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకుని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: VIDEO: రోడ్డు ఊడుస్తున్న GHMC కార్మికులరాలిని ఢీ కొన్న బస్సు! సీసీటీవీ దృశ్యాలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి