iDreamPost

భర్త, బావను తుపాకీతో కాల్చి చంపిన ఆశా వర్కర్

భార్యా భర్తల మధ్య సవాలక్ష సమస్యలు, గొడవలు ఉంటాయి. అలా అని మూడో వ్యక్తి జోక్యాన్ని త్వరగా ఇష్టపడరు. దంపతుల మధ్య గొడవలు, గిల్లికజ్జాలు తెలిసిన వాళ్లైతే.. వారి మధ్యకు పోరు. కానీ కొంత మంది.. దంపతుల గొడవల్లోకి తలదూరుస్తూ ఉంటారు.

భార్యా భర్తల మధ్య సవాలక్ష సమస్యలు, గొడవలు ఉంటాయి. అలా అని మూడో వ్యక్తి జోక్యాన్ని త్వరగా ఇష్టపడరు. దంపతుల మధ్య గొడవలు, గిల్లికజ్జాలు తెలిసిన వాళ్లైతే.. వారి మధ్యకు పోరు. కానీ కొంత మంది.. దంపతుల గొడవల్లోకి తలదూరుస్తూ ఉంటారు.

భర్త, బావను తుపాకీతో కాల్చి చంపిన ఆశా వర్కర్

ప్రతి కుటుంబంలోనూ సమస్యలు, గొడవలు వస్తూనే ఉంటాయి. భార్యా భర్తల మధ్య, అత్తా కోడళ్లు, ఆడపడుచు, వదినల మధ్య దగ్గర తరచూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. ఇవి చిలికి చిలికి పెద్దదవుతుంటాయి. దాడి చేసుకునేంత, విడిపోయేంత ఘర్షణలు నెలకొంటాయి. కొన్నిసార్లు వీరి విషయాల్లో పంచాయతీ జరిగి.. రాజీ పడిన సందర్భాలుంటాయి. కానీ కొంత మంది సమస్యను చిన్నదిగా కాకుండా పెద్దది చేసుకుంటూ ఉంటారు. అలాగే వీరి సమస్యల్లోకి మరొకరి జోక్యాన్ని కూడా సహించలేరు కొందరు. దీని వల్ల మనస్పర్థలు, ఇగోలు పీక్స్ చేరుకుని.. దారుణాలు చోటుచేసుకుంటాయి.  తాజాగా మధ్యప్రదేశ్‌లో ఆశావర్కర్ కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపానికి గురై భర్తను, బావను హతమార్చింది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బాద్ నగర్‌లోని ఇంగోరియా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది రాధేశ్యామ్.. సవితా కుమారియా కుటుంబం. వీరికి ముగ్గురు పిల్లలు. బావ ధీరజ్ కుటుంబం కూడా వీరి పక్కనే ఉంటుంది. సవిత స్థానికంగా ఆశా వర్కర్ గా వ్యహరిస్తోంది. కాగా, రాధే శ్యామ్ మద్యానికి బానిస కావడంతో.. భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. వీరి మధ్యలోకి బావ వస్తూ .. తన తమ్ముడికి సపోర్టుగా మాట్లాడేవాడు. సవితకు ఇది నచ్చేది కాదు. వీరి ప్రవర్తన పట్ల విసుగు చెందిన సవితా.. న్యూ ఇయర్ రోజున.. భర్త, బావను తుపాకీతో కాల్చి చంపింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దాని ప్రకారం..

ఇంటి ప్రాంగణంలో పూజలు చేస్తున్న బావ ధీరజ్‌ను మొదట సవిత కాల్చగా.. అతడికి గాయాలయ్యాయి. ఆ తర్వాత భర్తను హత్య చేసినట్లు చెబుతున్నారు. అక్కడికక్కడే భర్త రాధే శ్యామ్ మృతి చెందగా.. ధీరజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. హత్య అనంతరం మహిళా ఆ ఫిస్టల్‌తో పాటు ఇంగోరియా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోందని తెలుస్తోంది. అయితే సవితను విచారిస్తున్నామని, కచ్చితమైన కారణాలు నిర్దారిస్తామని పోలీసులు తెలిపారు. భర్తతో సవిత సజావుగా ఉండేది కాదన్న వాదన వినిపించింది. అయితే బావ ధీరజ్ అక్రమ ఆయుధాల వ్యాపారం చేశాడని తెలుస్తోంది. దీంతో ఆమెకు ఈ తుపాకీ లభించి హత్య చేసి ఉంటుందని అనుకుంటున్నారు. పోలీసులు  ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి