iDreamPost

హొలీ వేళ విషాదం.. ఉజ్జయిని ఆలయ గర్భగుడిలో అగ్ని ప్రమాదం!

దేశంలోని ప్రసిద్ద దేవాలయాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాాకాళేశ్వరాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గర్భ గుడిలో హారతి ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

దేశంలోని ప్రసిద్ద దేవాలయాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాాకాళేశ్వరాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గర్భ గుడిలో హారతి ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

హొలీ వేళ విషాదం.. ఉజ్జయిని ఆలయ గర్భగుడిలో అగ్ని ప్రమాదం!

దేశంలో ప్రసిద్ది గాంచిన జ్యోతిరింగ్లాల్లో ఒకటి మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయిని మహా కాళేశ్వరాలయం ఒకటి. ఈ గుడిలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుని ఆలయంలో పెద్ద యెత్తున భక్తులు పాల్గొని హోలీ ఆడుతున్నారు. ఈ సమయంలో దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పూజారులు. అంతలో భస్మ హారతి ఇస్తుండగా గర్భగుడిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మందికి కాలిన గాయాలయ్యాయి. గర్భగుడిలో పూజలు నిర్వహించిన పూజారీ సంజీవ్.. దేవునికి హారతి ఇస్తుండగా.. వెనుక నుండి గులాల్ (రంగులు) చల్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

గులాల్ గుడిలో ఉన్న దీపం మీద పడటంతో అందులో ఉన్న రసాయనాలు అంటుకుని మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్ని కీలకలు చెలరేగగానే.. హాహాకారాలు చేసుకుంటూ భక్తులు బయటకు వచ్చారు. కాగా, గర్భగుడిలో చిక్కుకుపోయారు పూజారులు.  మంటలు గుడిలో వ్యాపించడంతో పలువురు గాయపడ్డారు.  ప్రమాదం జరిగిన  వెంటనే అగ్ని మాపక దళానికి సమాచారం వెళ్లింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ కుమార్ యాదవ్ కుమారుడు వైభవ్, కూతురు కూడా ఆలయంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరు తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

హోలీ సందర్భంగా వేలాది మంది భక్తులు రంగులు జల్లుకుంటూ రంగుల హేళీ జరుపుకుంటుండగా ఒక్కసారిగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో  గర్భగుడిలో పూజలు చేస్తున్నఅర్చకుడు భస్మార్తి సంజయ్ గురు, వికాస్ పూజారి, మనోజ్ పూజారి, అన్ష్ పురోహిత్, చింతమన్ గెహ్లాట్,  ఆనంద్ కమల్ జోషి సహా 13 మందికి కాలిన గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరనీ ఆసుపత్రిలో చేర్పించినట్లు కలెక్టర్ నీరజ్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కమిటీ మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక అందించనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి