iDreamPost

హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్‌..! ఆమె చేసిన పనికి షాకైన పోలీసులు

సురక్షితమైన ప్రయాణం కోసం హెల్మెట్ ధరించండి అంటూ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తుంటారు. అయితే ఓ లేడీ టీచర్ హెల్మెట్ లేకుండా పట్టుబడి హై డ్రామా క్రియేట్ చేసింది.

సురక్షితమైన ప్రయాణం కోసం హెల్మెట్ ధరించండి అంటూ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తుంటారు. అయితే ఓ లేడీ టీచర్ హెల్మెట్ లేకుండా పట్టుబడి హై డ్రామా క్రియేట్ చేసింది.

హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్‌..! ఆమె చేసిన పనికి షాకైన పోలీసులు

రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ అధికారులు ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. డ్రైవ్ చేస్తున్న సమయంలో హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంట్ రూట్, ఓవర్ స్పీడ్ ఇలా పలు రూల్స్ ను అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇదే విధంగా ఓ రాష్ట్రంలో ఓ మహిళా టీచర్ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి.. పోలీసులకు పట్టుబడి నానా రచ్చ చేసింది. ఆమె చేసిన పనికి పోలీసులు షాక్ అయ్యారు. ఏకంగా పోలీస్ అధికారి ఆమెకు చేతులు జోడించి దండం పెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్నారు. ఈ చెకింగ్ లో భాగంగా ఓ మహిళ హెల్మెట్ లేకుండా పట్టుబడింది. సదరు మహిళపై పోలీసు అధికారి చలాన్ విధించాడు. దీంతో ఆమె సహనం కోల్పోయి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. రోడ్డుపై అరుస్తూ, ఏడుస్తూ నానా హంగామా క్రియేట్ చేసింది. దీంతో ఆమె చేస్తున్న నిర్వాకానికి పోలీసులు బిత్తరపోయారు. ఆమెను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించేందుకు పోలీస్ అధికారి ఆ మహిళకు చేతులెత్తి దండం పెట్టాడు. ఈ ఘటన విజయనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

అందిన సమాచారం ప్రకారం హెల్మెట్ లేకుండా పట్టుబడిన మహిళ టీచర్ అని తెలిసింది. పోలీసులు విధించిన ఫైన్ ను కట్టకుండా తప్పించుకునేందుకు ఆమె హైడ్రామాకు తెరలేపింది. పోలీసులు మహిళను ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె వినలేదు. దీంతో పోలీసులే దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధుల్లో ఉన్న పోలీసు అధికారి మహిళ ముందు చేతులు జోడించి.. దయచేసి నన్ను క్షమించి మీరు వెళ్ళండి అంటూ వేడుకున్నారు. ఇక ఇటీవల ఓ మహిళ 200 పైగా చలాన్లతో పోలీసు అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంతమంది వాహనదారుల తీరువల్ల ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందికరంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి