గత కొన్ని రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ఓ బిగ్ అనౌన్స్ మెంట్ రాబోతోందని. సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటలకు ఈ బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందన్నది ఈ న్యూస్ సారాంశం. అనుకున్నట్లుగానే జక్కన్న అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చాడు. అయితే ఈసారి డైరెక్టర్ గా కాదు.. సమర్పకుడిగా రాబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు దర్శక ధీరుడు. ఇది ఓ బయోపిక్ అని, కథ విన్నప్పుడే భావోద్వేగానికి గురైయ్యానని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మహేష్ బాబు సినిమాకు ముందే ఓ కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు దర్శక ధీరుడు జక్కన్న. అయితే ఈ ప్రాజెక్ట్ ఆయన డైరెక్షన్ లో కాదు.. జక్కన్న సమర్పణలో. గత కొన్ని రోజులుగా రాజమౌళి నుంచి ఓ బిగ్ అప్డేడ్ వస్తుందని ఇండస్ట్రీ మెుత్తం మాట్లాడుకుంటోంది. దీంతో ఈ అప్డేట్ కచ్చితంగా మహేష్ సినిమా గురించేనని అందరూ అనుకున్నారు. కానీ జక్కన్న ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు. రాజమౌళి సమర్పణలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ‘మేడిన్ ఇండియా’ అనే టైటిల్ తో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాస్ అయిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా.. వరుణ్ గుప్తా రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ కథ విన్నప్పుడే ఎమోషనల్ అయ్యానని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే బయోపిక్ లు తీయడం చాలా కష్టమైన పని.. కానీ ఆ పనిని మా కుర్రాళ్లు పూనుకున్నారు అంటూ ట్విట్టర్ ద్వారా వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. డైరెక్టర్ నితిన్ కక్కర్ మిత్రోన్(2018), జవానీ జానేమాన్(2020) చిత్రాలతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి రాజమౌళి సమర్పిస్తున్న ఈ చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
When I first heard the narration, it moved me emotionally like nothing else.
Making a biopic is tough in itself, but conceiving one about the FATHER OF INDIAN CINEMA is even more challenging. Our boys are ready and up for it..:)
With immense pride,
Presenting MADE IN INDIA… pic.twitter.com/nsd0F7nHAJ— rajamouli ss (@ssrajamouli) September 19, 2023