iDreamPost

MS Dhoni: వీడియో: వరల్డ్ కప్ విన్నింగ్ షాట్​ను రిపీట్ చేసిన ధోని.. బౌలర్ ఒక్కడే మారాడు!

  • Published Apr 19, 2024 | 10:13 PMUpdated Apr 19, 2024 | 10:13 PM

ఎంఎస్ ధోని ఫుల్ పైసా వసూల్ ఇన్నింగ్స్​తో మరోసారి మెరిశాడు. స్టేడియానికి వచ్చిన అభిమానులకు మస్తు వినోదాన్ని పంచాడు మాహీ.

ఎంఎస్ ధోని ఫుల్ పైసా వసూల్ ఇన్నింగ్స్​తో మరోసారి మెరిశాడు. స్టేడియానికి వచ్చిన అభిమానులకు మస్తు వినోదాన్ని పంచాడు మాహీ.

  • Published Apr 19, 2024 | 10:13 PMUpdated Apr 19, 2024 | 10:13 PM
MS Dhoni: వీడియో: వరల్డ్ కప్ విన్నింగ్ షాట్​ను రిపీట్ చేసిన ధోని.. బౌలర్ ఒక్కడే మారాడు!

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈసారి ఐపీఎల్​లో అదరగొడుతున్నాడు. అతడి బ్యాట్ ఫుల్ స్వింగ్​లో ఉంది. వింటేజ్ మాహీని గుర్తుచేస్తూ విధ్వంసక ఇన్నింగ్స్​లతో చెలరేగిపోతున్నాడు. క్రీజులోకి వచ్చిందే తడవు భారీ సిక్సులు, స్టన్నింగ్ బౌండరీస్​తో విరుచుకుపడుతున్నాడు. ఇవాళ లక్నో సూపర్ జియాంట్స్​తో మ్యాచ్​లోనూ అదే జరిగింది. 9 బంతులు ఎదుర్కొన్న ధోని ఏకంగా 28 పరుగులు బాదేశాడు. అందులో 3 ఫోర్లతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. అతడు కొట్టిన ఓ సిక్స్ ఏకంగా 101 మీటర్ల దూరం వెళ్లి పడింది.

యష్ ఠాకూర్ బౌలింగ్​లో ఆఫ్ వికెట్ మీద పడిన బంతిని లెగ్ సైడ్ వైపు బిగ్ షాట్​గా మలిచాడు ధోని. అతడి బలానికి సరిగ్గా కనెక్ట్ అయిన బాల్ కాస్తా వెళ్లి స్టాండ్స్​లో పడింది. ఈ షాట్​తో 2011 వరల్డ్ కప్ ఫైనల్​ను గుర్తుచేశాడు మాహీ. అప్పుడు కులశేఖర బౌలింగ్​లో కొట్టిన విధంగానే లెఫ్ట్ లెగ్ మీద వెయిట్​ను ఉంచి షాట్​ను బలంగా బాదాడు. దీంతో అందరూ ప్రపంచ కప్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. బౌలర్ ఒక్కడే మారాడని, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని అంటున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్​కే ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57) టాప్ స్కోరర్. అజింక్యా రహానె (36), మొయిన్ అలీ (30) ఫర్వాలేదనిపించారు. ఛేజింగ్ స్టార్ట్ చేసిన లక్నో 7 ఓవర్లకు వికెట్లేమీ కోల్పోకుండా 62 పరుగులతో ఉంది. మరి.. ధోని సిక్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి