iDreamPost

Business Plan: రోజుకు రూ.15 వేలు పొందండి.. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం!

నేటికాలంలో అవకాశాలను అందిపుచ్చుకున్న వారు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అది వ్యవసాయ రంగానికి కూడా వర్తిస్తుంది. అలానే ఓ బిజినెస్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నేటికాలంలో అవకాశాలను అందిపుచ్చుకున్న వారు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అది వ్యవసాయ రంగానికి కూడా వర్తిస్తుంది. అలానే ఓ బిజినెస్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Business Plan: రోజుకు రూ.15 వేలు పొందండి.. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం!

ప్రతి ఒక్కరు ఎక్కువగా డబ్బులు సంపాదించాలనే భావిస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగాలు చేసే వారు కొందరు అయితే, బిజినెస్ లు చేసే వారు మరికొందరు. అలానే కాలానికి అనుగుణంగా కొందరు తమ ఆలోచనకు పదును పెట్టి.. మంచి ఆదాయాన్ని పొందుతారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఆధునికంగా వచ్చిన మార్పులతో మంచి ఆదాయం అర్జిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ రోజుకు రూ.15 వేలు పొందే మంచి ఐడియా  ఉంది. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందొచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్వం వ్యవసాయం అంటే శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. ప్రతి పనికి మనుషుల అవసరం ఎక్కువగా ఉండేది. అయితే కాలం మారింది.. అలానే వ్యవసాయం చేసే విధానంలో అనేక మార్పులు వచ్చాయి. వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా పూర్వం రైతులు వ్యవసాయం చేసే క్రమంలో వరి సాగు చేసే విషయంలో రైతులు బాగా శ్రమించే వారు. వరి కోతలు  కోసిన తర్వాత.. దానిని కట్టలు కట్టడానికి ఎంతో కష్టపడే వారు. అంతేకాక వరిగడ్డి వాము వేయడానికి దాదాపు రెండు రోజులు సమయం పట్టేది. కానీ ప్రస్తుత వరి మిషన్లతో ఎక్కువ వరి కట్టలు కట్టడం వలన రైతులకు శారీరక శ్రమ తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ వరి గడ్డి కట్టలు కట్టే ప్రత్యేక యంత్రంతో.. పలువురు భారీగా ఆదాయం పొందుతున్నారు.

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన ఎడ్ల రమేష్ ఈ వరి గడ్డి యంత్రాన్ని వినియోగిస్తున్నాడు. రమేశ్ ఉంటే ప్రాంతంలో ఎక్కువగా వరిని సాగు చేస్తారు. అలానే వరి గడ్డి కట్టలు కట్టేందుకు మంచి డిమాండ్ ఉంది. దీంతో అదే విషయాన్ని గమనించిన రమేశ్ రెండేళ్ల క్రితం గడ్డి కట్టల మిషన్ ను ట్రాక్టర్ షోరూం నుంచి రూ.3 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ యంత్రాన్ని ట్రాక్టర్ కు ఏర్పాటు చేసి దానిని ఉపయోగించడం ప్రారంభించారు. ఇక ఈ మిషన్ ను ఎలా నడపాలి, ఎలా ఆపరేటింగ్ చేయాలనేది రమేష్ దాదాపు 20 రోజుల్లో నేర్చుకున్నాడు.  ఈక్రమంలో షోరూం వాళ్లే పూర్తిగా శిక్షణ ఇచ్చినట్లు రమేష్ తెలిపారు. ఈ యంత్రానికి పెద్దగా రిపేర్ ఖర్చులు కూడా లేవన ఆయన అన్నారు. అయితే ఈ మిషన్ కి  కావాల్సిందల్లా ముందే ఉపయోగించిన ఆయిల్, ఒక పురికొస లడి అవసరం ఉంటుందని తెలిపారు.

ఇక వరి కట్ట ఒకటి కట్టినందకు రైతుల నుంచి రూ.30 వస్తాయని తెలిపారు. అలా గంటలోనే 60 కట్టలను ఈ యంత్రం కట్టేస్తుందని తెలిపారు. అలా ఈ మిషన్ రోజుకు 500 వరకు వరి గడ్డి కట్టలను కడుతుందని రమేష్ తెలిపారు. అలా లెక్కేసుకున్నట్లు అయితే  ప్రతి రోజూ 15 వేల రూపాయల ఆదాయం పొందవచ్చని అతడు పేర్కొన్నాడు. వరిసాగు సీజన్ ఉన్నని రోజులు ఈ మిషన్ కి డిమాండ్ ఉంటుంది. ఈ గడ్డి కట్టలు కట్టే సీజన్ దాదాపు రెండు నుంచి మూడు  నెలల వరకు ఉంటుంది. అంటే ఈ మూడు నెలల కాలంలో ఈ మిషన్ ద్వారా తక్కువ పెట్టుబడితే  ఎక్కువ ఆదాయం పొందవచ్చని రమేష్ తెలిపారు. ఇలా వ్యవసాయంలో అనేక కొత్త యంత్రాలు డిమాండ్ ఉంది.  ఇలా కాలంలో జరిగే మార్పులను అవకాశంగా మార్చుకుని ఎందరో మంచి ఆదాయం పొందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి