iDreamPost

మణిపూర్‌లో హింసాత్మకం.. ఈవీఎంలు తగులబెట్టిన దుండగులు

లోక్ సభ తొలి దశలో భాగంగా 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు ఈ శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో మణిపూర్ మరోసారి అట్టుడికింది. అక్కడ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

లోక్ సభ తొలి దశలో భాగంగా 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు ఈ శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో మణిపూర్ మరోసారి అట్టుడికింది. అక్కడ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

మణిపూర్‌లో హింసాత్మకం.. ఈవీఎంలు తగులబెట్టిన దుండగులు

ప్రస్తుతం దేశంలో ఎన్నికల జోరు కొనసాగుతుంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. ఇక లోక్ సభకు ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ముగిసింది. తొలి విడతలో అరుణా చల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మణిపూర్, మేఘాలయ, మహారాష్ట్ర, మిజోరాం, రాజస్తాన్, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్ము కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరీ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో 102 లోక్ సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. అరుణాచల్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి.

మణిపూర్ మినహాయించిన మిగిలిన ప్రాంతాల్లో చెదురు ముదురు ఘటనలు తప్ప..ప్రశాంతంగా తొలి దశ ఎన్నికలు ముగిశాయి. కాగా, మొన్నటి వరకు అగ్ని గుండంలా మారిన మణిపూర్ రాష్ట్రంలో ఈ ఎన్నికల సందర్భంగా కొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలను తగుల బెట్టారు ప్రజలు. మరికొన్ని చోట్ల పగుల గొట్టారు. పలు ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. మోయిరంగ్ కాంపూ సాబెబ్‌లోని పోలింగ్ కేంద్రం దగ్గర దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వృద్ధుడు గాయపడ్డాడు. ఈ మొత్తం కాల్పుల ఘటనల్లో నలుగురు గాయపడ్డారని తెలుస్తోంది. ఇంపాల్ తూర్పు ప్రాంతం క్షేత్రిగావ్ అసెంబ్లీ నియోజకవర్గం బామెన్ కంపు పోలింగ్ స్టేషన్, కక్చింగ్ సెక్ మైజిన్ ఖునావో మమాంగ్ పోలింగ్ కేంద్రం, తోంగ్జు పోలింగ్ స్టేషన్ లాంటి ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసం చేశారు.

బిష్ణువులోని మొయిరాంగ్ అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని థమ్నాపోక్సి పోలింగ్ కేంద్రం వద్ద దుండగులు ఓటర్లను కాల్పులతో బయపెట్టారు. 30 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.  దీంతో ఈ సారి అత్యత్పంగా రాష్ట్రంలో ఓటింగ్ శాతం నమోదు అయినట్లు తెలుస్తోంది. కొంత మంది సాయుధులు పహారా కాస్తూ.. ఓటర్లను ఓటింగ్ వేయొద్దంటూ బెదిరించడంతో చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కాగా, ఈ దాడి ఘటనలకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మోయిరంగ్ కాంపూ సాజేబ్ వద్ద కాల్పులకు తెగబడిన వారని గుర్తించారు. వీరి దగ్గర నుండి ఆయుధాలతో పాటు రూ. 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి