iDreamPost

మోదీ గుడ్ న్యూస్… ఏకంగా రూ.25 వేలు గెలుపొందే ఛాన్స్!

నరేంద్ర మోదీ ప్రభుత్వం తరచూ ప్రజకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతూనే ఉంటుంది. అలానే కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పోటీలు నిర్వహించి.. విజేతలకు నగదు బహుమానం అందిస్తుంది. తాజాగా ఓ ఏకంగా రూ.25వేలు గెలుపొందే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం తరచూ ప్రజకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతూనే ఉంటుంది. అలానే కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పోటీలు నిర్వహించి.. విజేతలకు నగదు బహుమానం అందిస్తుంది. తాజాగా ఓ ఏకంగా రూ.25వేలు గెలుపొందే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

మోదీ గుడ్ న్యూస్… ఏకంగా రూ.25 వేలు గెలుపొందే ఛాన్స్!

కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను తీసుకొచ్చింది. అంతేకాక అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు మరెన్నో సంస్కరణలు చేపట్టింది. అదేవిధంగా పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా పలు స్కీమ్స్ ప్రవేశపెట్టి ప్రజలకు ఆదాయం లభించేలా చేయూతనిస్తుంది. ఇలా కేవలం పథకాలు, సంస్కరణలే కాకుండా అప్పుడప్పుడు పోటీలను కూడ కేంద్రం నిర్వహిస్తుంటుంది. అంతేకాక ఈ పోటీల్లో విజేతలకు భారీగా నగదు బహుమానం కూడా ఇస్తుంటారు. తాజాగా ఒక పోటీని  కేంద్రం ప్రారభించింది. దాని ద్వారా మీరు  రూ.25 వేలు పొందవచ్చు. అయితే ఈ వివరాలు మీరు తెలుసుకోవాల్సిందే.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘మైగౌ’  అనే సంస్థ కొత్తగా ఓ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలు గెలిచిన వారికి రూ.25 వేల నగదు బహుమానం అందించనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆ పోటీ ఏంటీ, ఏం చేయాలి? ఎంత డబ్బులు ఇస్తారు? వంటి అంశాలు గురించి సదరు సంస్థ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నడుస్తోన్న కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోసం లోగో డిజైన్ పోటీలను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిచినవారికి భారీగా నగదను అందించనుంది. అలా ఈ  కాంటెస్ట్ ద్వారా మీరు డబ్బులు పొందాలని భావిస్తున్నారా?. అయితే  మీరు చేయాల్సిన పని కేవలం లోగో డిజైన్  చేయడమే. మన దేశంలో ఆందోళన కలిగించే అంశాల్లో డ్యామ్ భద్రతకు సంబంధించినది ఒక ప్రధానమైనది.  వివిధ సంస్థలు, ఆర్ఘనైజేషన్స్ డ్యామ్ నిర్మాణం, భద్రత కోసం నిర్వహణ అంశాలను నిర్వహిస్తాయి.

డ్యామ్ భద్రతలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ డ్యామ్ సేప్టీ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసింది. అంతేకాక ఇంటిగ్రేటెడ్ డ్యామ్ సేప్టీ మేనేజ్ మెంట్ కోసం కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే ఉన్న పద్దతులను సమీక్షించడానికి, డ్యామ్ భద్రత కోసం ఒక సమగ్ర ప్రక్రియ అభివృద్ధికి చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. 1982  ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచనల మేరకు మన దేశంలో డ్యామ్ భద్రతను పర్యవేక్షించడానికి జాతీయ ప్రాజెక్ట్ భద్రత నిర్వహణ ను స్థాపించారు. ఇదే 2021లో డ్యామ్ సేప్టీ యాక్ట్  గా మారింది.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. తాజాగా మైగౌ సహకారంతో ఒక పోటీని నిర్వహిస్తోంది. డ్యామ్ సేఫ్ట్ కి సంబంధించి లోగోను రూపొందించమని ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తుంది. లోగో డిజైనింగ్ కాంపిటీషన్  ప్రధాన ఉద్దేశం.. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం. అందుకే పోటీల్లో పాల్గొనే వారు పవర్‌ఫుల్ విజువల్ ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విధులను సూచించేలా లోగో ఉండాల్సి ఉంటోంది.

మీరు రూపొందించే లోగోను వెబ్‌సైట్, సోషల్ మీడియాలో ఉపయోగించేలా ఉండాల్సి ఉంటుంది. డిజైన్ చేసిన లోగ్ ఒరిగినల్ ఓపెన్ సోర్స్ ఫైల్ అందించాల్సి ఉంటుంది. అలాగే మీరు రూపొందించిన లోగో డిజైన్స్ పై వాటర్ మార్క్స్ ఉండకూడదు. అలాగే పిక్సెల్ ఔట్ కాకూడదు. అదే విధంగా కంప్రెస్డ్ ఫార్మాట్ లో కూడా ఉండకూడదు. హిందీ లేదా ఇంగ్లీష్ లోనే లోగో డిజైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం రూపొందించిన లోగో అర్థం ఏంటో తెలియజేసేలా ఒక నోట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

మీరు మీ గోలోను జేపీజీ, పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఇవ్వొచ్చు. 1000*1000 పిక్సెల్స్ డైమెన్షన్స్‌లో లోగో ఉండాల్సి ఉంటుంది. తప్పపని సరిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే లోగో డిజైన్ చేయాలి. ఫుల్ కలర్ వెర్షన్, బ్లాక్ అండ్ వైట్ వర్షన్ లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రూ.25 వేలు అందిస్తారు. అలాగే ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇందులో పాల్గొనడానికి ఫిబ్రవరి 14వ తేదీ తుది గడువుగా ఉంది. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే సంబంధిత వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలానే పోటీలో పాల్గొన్ని రూ.25 వేలను ఫ్రీగా పొందండి. మరి.. ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి