iDreamPost

ఎలాన్ మస్క్ బ్రెయిన్ చిప్ ప్లాన్ బెడిసికొట్టిందా? ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రయోగం!

Elon Musk Neuralink First Brain Chip Implant Patient Face Issues: ఎలాన్ మస్క్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెదడులో చిప్ పెట్టే కార్యక్రమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయాన్ని స్వయంగా న్యూరాలింక్ సంస్థ వెల్లడించింది.

Elon Musk Neuralink First Brain Chip Implant Patient Face Issues: ఎలాన్ మస్క్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెదడులో చిప్ పెట్టే కార్యక్రమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయాన్ని స్వయంగా న్యూరాలింక్ సంస్థ వెల్లడించింది.

ఎలాన్ మస్క్ బ్రెయిన్ చిప్ ప్లాన్ బెడిసికొట్టిందా? ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రయోగం!

సరికొత్త ప్రయోగాలు, కొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇప్పటికే ఆయన టెక్నాలజీ యుగంలో తన మార్క్ చూపించారు. మెదడులో చిప్ ఇంప్లాంట్ చేసే సరికొత్త ప్రయోగానికి ఎలాన్ మస్క్ తెర లేపిన విషయం కూడా తెలిసిందే. ఇటీవలే కొన్నేళ్లపాటు ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఇటీవలే మనిషి మెదడులో కూడా సక్సెస్ ఫుల్ గా చిప్ ని ఇంప్లాట్ చేశారు. అయితే ఈ ప్రయోగంలో ఎలాన్ మస్క్ కు ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిప్ ఇంప్లాంట్ ప్రయోగంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది అంటున్నారు.

ఎలాన్ మస్కుకు చెందిన న్యూరాలింక్ కంపెనీ మనిషి మెదడులో చిప్ ని పెట్టే బృహత్తర ప్రయోగానికి తెరలేపింది. కొన్నేళ్ల పాటు పందులు, కోతులు, గొర్రెలు వంటి పలు జంతువులపై న్యూరాలింక్ ప్రయోగాలు జరిపింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో నోలాన్ అర్బాగ్ అనే మనిషి మెదడులో ఈ చిప్ ని అమర్చారు. ఆ విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అతను చిప్ ఇంప్లాంట్ సాయంతో చెస్ గేమ్ కూడా ఆడాడు. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ న్యూరాలింక్ కంపెనీకి పెద్ద ఎద్దురదెబ్బ తగిలినట్లు ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలోనే మెదడులో పెట్టిన ఆ చిప్ పనితీరు మందగించినట్లు న్యూరాలింక్ వెల్లడించింది.

Elon Musk

నోలాన్ అర్బాగ్ మెదడులో పెట్టిన చిప్ డిటాచ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందని, పనితీరు మందగించినట్లు న్యూరాలింక్ ప్రకటించింది. నోలాన్ మెదడుకు అనుసంధానిస్తూ అమర్చిన మీనియేచర్ కంప్యూటర్ థ్రెడ్స్ చిన్నగా విడిపోతున్నట్లు చెప్పారు. అయితే అలా ఎందుకు జరుగుతోంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తమ ఇంజినీర్లు ఆ సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించారు. పేషెంట్ తిరిగి యధార్థ స్థితికి వచ్చినట్లు కూడా చెప్పుకొచ్చారు. ఈ సమస్య వల్ల బాధితుడికి ఏమైనా ప్రాణ హాని ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం నోలాన్ అర్బాగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.

ఈ చిప్ పెట్టడం వల్ల తన జీవితం ఇప్పటికే మారిపోయింది అంటూ నోలాన్ అర్బాగ్ గతంలో వెల్లడించాడు. అయితే అతను అప్పుడే ఈ ప్రయోగం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించాడు. ఇప్పుడు ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ లింక్ సంస్థ మెదడులో చిప్ ఇంప్లాంట్ చేసే ప్రయోగం విషయంలో కాస్త దూకుడు తగ్గిస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే సమస్యను పరిష్కరించినట్లు ప్రకటించారు కాబట్టి.. నెక్ట్స్ ఏం చేస్తారు అనేది వేచి చూడాలి. మరి.. ఎలాన్ మస్క్ చిప్ ఇంప్లాట్ ప్రయోగం మానవాళికి అవసరమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి