iDreamPost

10th Result: కూలీ కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం.. 500లకి 497!

నేటికాలంలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని, శ్రమను అర్థం చేసుకోవడం లేదు. ఇష్టానుసారంగా తిరుగుతూ చదువులపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ కొందరు పిల్లలు తమ పేదరికంలో ఉన్న కూడా చదువుపై మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయ్యరు.

నేటికాలంలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని, శ్రమను అర్థం చేసుకోవడం లేదు. ఇష్టానుసారంగా తిరుగుతూ చదువులపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ కొందరు పిల్లలు తమ పేదరికంలో ఉన్న కూడా చదువుపై మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయ్యరు.

10th Result: కూలీ కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం.. 500లకి 497!

ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టినప్పుడు వచ్చే సంతోషం కంటే.. ఆ పిల్లలు పెద్దై సమాజంలో మంచి కీర్తి సంపాదించినప్పుడు వచ్చే ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైన మొక్కపెరిగినప్పుటి కంటే.. ఆ పెద్దై నీడ నిచ్చినప్పుడే అందరికి సంతోషంగా ఉంటుంది. అలానే చాలా మంది పిల్లలకు కూడా తమ తల్లిదండ్రలు కష్టాలను అర్థం చేసుకుని, వారి శ్రమను వృధా కానివ్వకూడదని భావిస్తుంటారు. అలా ధృడంగా భావించిన ఓ కూలి కుమార్తె స్టేట్ టాపర్ గా నిల్చి అందరి ప్రశంసలు అందుకుంటుంది. 500 గాను 497 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలించింది. పూర్త వివరాల్లోకి వెళ్తే..

నేటికాలంలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని, శ్రమను అర్థం చేసుకోవడం లేదు. ఇష్టానుసారంగా తిరుగుతూ చదువులపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు. లక్షలు పోసి చదివిస్తున్నా కూడా చదువుపై ఎక్కువ ఆసక్తి చూపించరు. కానీ కొందరు పిల్లలు తమ పేదరికంలో ఉన్న కూడా చదువుపై మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయ్యరు. తల్లిదండ్రులు.. తమ కోసం చింధించే ప్రతి చెమటి చుక్కకు న్యాయం చేయాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో రేయింబవళ్లు కష్టపడి..పరీక్షలు రాస్తుంటారు. చివరకు అనుకున్న లక్ష్యం చేరుకుని తమ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందానికి కారణం అవుతుంటారు. తాజాగా సుస్య అనే కూలీ కుమార్తె కూడా అలాంటి అరుదైన, మధురైన జ్ఞాపకాన్ని తన తల్లిదండ్రులకు అందించింది.

శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.ఈ పబ్లిక్ పరీక్షలో సుస్య అనే విద్యార్థికి టాప్ స్కోర్ సాధిచింది. మధురై జిల్లా ఉసిలంబట్టి సమీపంలోని ఎగ్మోరెలై ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సుస్య చదువుతుంది. తాజాగా విడుదలైన ఫలితాల్లో సుస్యకు 500 మార్కులకు గాను 497 మార్కులు సాధించింది. సుస్యకు టాప్ స్కోర్ రావడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు సుస్యాను సన్మానించారు. కూలీగా ఉండే తన తండ్రి కష్టపడి తనను చదివించాడని సుస్య చెప్పుకొచ్చింది. నిరంతరం ఆయన కష్టమే తన కళ్ల ముందు కనిపించేదని చెప్పుకొచ్చింది.

అలా తన అమ్మానాన్నలు, టీచర్ల ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించినట్లు సుస్య తెలిపింది.  రెండు రోజుల క్రితం కర్ణాటకలో కూడా ఎస్ఎస్ఎల్సీ ఫలితాలను రిలీజ్ చేసింది. ఇందులో బాగల్ కోట్‌కు చెందిన రైతు బిడ్డ అంకిత బసప్ప కొన్నూరు అనే విద్యార్థిని స్టేట్ టాపర్‌గా నిలిచింది. 625 మార్కులు గానూ.. 625 మార్కులు తెచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. మరి..అన్ని సౌకర్యాలు ఉన్న చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండే వారు.. సుస్యను చూసైనా మారాలని పలువురు అభిప్రాయా పడుతున్నరు. మరి.. అద్భుతమైన ఘనతను సాధించిన ఈ  కూలీ బిడ్డకు మీ శుభాకాంక్షలు తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి