iDreamPost

సమంతపై డాక్టర్ ఫైర్.. తెలియకపోతే నోరు మూసుకోవాలి అంటూ..

Doctor Fire On Samantha: స్టార్ హీరోయిన్ సమంతపై ఓ వైద్యుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమంతలాంటి వ్యక్తి నుంచి అలాంటి మాటలు వింటాను అనుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. తెలియని విషయం గురించి ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నించాడు.

Doctor Fire On Samantha: స్టార్ హీరోయిన్ సమంతపై ఓ వైద్యుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమంతలాంటి వ్యక్తి నుంచి అలాంటి మాటలు వింటాను అనుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. తెలియని విషయం గురించి ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నించాడు.

సమంతపై డాక్టర్ ఫైర్.. తెలియకపోతే నోరు మూసుకోవాలి అంటూ..

స్టార్ హీరోయిన్ సమంతకు ఓ వైద్యుడు షాకిచ్చాడు. ఆమెపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యాడు. ఏ విషయం అయినా తెలియకపోతే తెలియదు అని నోరు మూసుకోవాలి.. అంతేగాని ఇలా అజ్ఞాన్ని పంచుతారా? అంటూ సూటిగా ప్రశ్నించాడు. ఆరోగ్యానికి సంబంధించి మీ ఇష్టమొచ్చిన విషయాలను ప్రచారం చేయద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు తమకు తెలియదు అంటే సరిపోతుంది అంటూ హితవు పలికాడు. అసలు ఆ డాక్టర్ ఎవరు? ఎందుకు సమంతపై ఫైర్ అయ్యాడు? అసలు సమంత అంత తప్పు ఏం చెప్పింది? అసలు ఏం జరిగిందంటే.. సమంత ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఆ పాడ్ కాస్ట్ లో కాలేయాన్ని ఎలా శుద్ధి(లివర్ డీ టాక్సింగ్) చేసుకోవాలి అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకుంది. లివర్ డీ టాక్సిఫికేషన్ కి ఏం చేయాలో చెప్పుకొచ్చింది. అక్కడే ఆ డాక్టర్ కు కోపం కట్టలు తెంచుకుంది. అసలు మీకు ఏం తెలుసు? మీరు ఏం చెప్తున్నారు? అంటూ ఏకిపారేశాడు.

“కాలేయాన్ని శుద్ధి చేయడం అనే అశంపై సమంత తన 33 మిలియన్ల ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తోంది. అసలు ఏమీ తెలియని వెల్ నెస్ కోచ్ లు, న్యూట్రీషియన్ లను తీసుకొచ్చి ఈ పాడ్ కాస్ట్ లో మాట్లాడిస్తున్నారు. కేవలం ఫాలోవర్స్ ఉంటే సరిపోతుంది అన్నట్లు ఎవరిని పడితే వారిని తీసుకొస్తున్నారు. అలాంటి వారిక అసలు హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్ ఎలా అవుతుందో కూడా తెలియదు. ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధులను కొన్ని మూలికల సహాయంతో పోగొట్టచ్చు అంటూ చెప్తున్నారు. ఆరోగ్యం, ఔషధాల గురించి ఏమీ తెలియకపోయినా సెలబ్రిటీలు అనే ఒకే కారణంతో పాడ్ కాస్టులు చేయిస్తున్నారు. వెల్ నెస్ కోచ్ అని చెప్పుకునే ఆ వ్యక్తికి మెడికల్ ఫీల్డ్ లో కనీసం అవగాహన కూడా లేదు.

పాడ్ కాస్ట్ లో మాట్లాడే వారికి అసలు లివర్ ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు. సైన్స్ గురించి ఏం తెలియని ఇద్దరు వ్యక్తులు వారి అజ్ఞానాన్ని పంచుకుంటున్నారు. అతను డాండలియన్ అనే మొక్క కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని చెప్తున్నాడు. నేను పదేళ్లుగా లివర్ స్పెషలిస్ట్ గా చేస్తున్న అనుభవంతో వారి వాదనను పూర్తిగా ఖండిస్తున్నాను. డాండలియన్ అనేది కేవలం మూత్ర విసర్జనను ప్రేరేపించేందుకు వెనుకటికి ఔషదాల్లో వాడేవాళ్లు. అసలు డాండలియన్ మనుషుల ఆరోగ్యానికి మంచిది అని ఎక్కడా నిర్ధారణ కాలేదు. దానివల్ల వేరే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటూ చెప్తుంటారు. కానీ, దాని మీద విస్తృత స్థాయిలో పరిశోధన జరగాలి. ఎలుకల్లో ఇది మంచి ఫలితాలు ఇచ్చినట్లు చూపించినా.. దాని నుంచి మనుషుల్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి అనే విషయం పూర్తిగా తెలియదు కాబట్టి డాండలియన్ ను మనుషులకు రికమెండ్ చేయకూడదు” అంటూ ఆ లివర్ స్పెషలిస్ట్ తన ఎక్స్.కామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఆ డాక్టర్ తమ అభిమాన హీరోయిన్ ని అలా అనగానే సమంత ఫ్యాన్స్ అంతా ఆగ్రహంతో రగిలిపోయారు. డాండలియన్ కి సంబంధించిన సైన్టిఫిక్ రిపోర్ట్స్ అంటూ స్క్రీన్ షాట్స్ పెట్టారు. అయితే ఫ్యాన్స్ ని కూడా ఆ వైద్యుడు ఒక ఆట ఆడుకున్నాడు. ముందు మీరు మనుషులా? ఎలుకలా? తేల్చుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చాడు. మీరు ఈ విషయాన్ని మరీ పర్సనల్ గా తీసుకుని హీరోలు అయిపోవాలి అని చూడొద్దు అంటూ హితవు పలికాడు. ఇది ఫీల్డ్ కాదు.. ఇది సైన్స్ అంటూ చురకలు అంటించాడు. ప్రస్తుతం ఈ లివర్ డీ టాక్సిఫికేషన్, సమంత కామెంట్స్, డాక్టర్ కౌంటర్స్, ఆ పాడ్ కాస్ట్ వీడియో అన్నీ వైరల్ అవుతున్నాయి. సమంతపై వైద్యుడు ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి