iDreamPost
android-app
ios-app

OTT New Releases: ఈ నెలలో OTT లోకి 5 తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

  • Published Jun 10, 2024 | 9:39 AMUpdated Jun 10, 2024 | 9:39 AM

థియేటర్ లో వచ్చే సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు ఈ నెలలో అన్ని అలాంటి సినిమాలే ఉండడం విశేషం. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

థియేటర్ లో వచ్చే సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు ఈ నెలలో అన్ని అలాంటి సినిమాలే ఉండడం విశేషం. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Jun 10, 2024 | 9:39 AMUpdated Jun 10, 2024 | 9:39 AM
OTT New Releases: ఈ నెలలో OTT లోకి 5 తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఓటీటీ లలోకి అడుగుపెట్టడానికి ఎంతో సమయం తీసుకోవడం లేదు. సాధారణంగా ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి రావాలంటే .. నెల రోజుల పైనే పడుతుంది. కానీ కొన్ని సార్లు థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అంత సమయం తీసుకోకుండానే.. వెంటనే ఓటీటీ లలో దర్శనం ఇచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు థియేటర్ లో వచ్చే సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు ఈ నెలలో అన్ని అలాంటి సినిమాలే ఉండడం విశేషం. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

ఈ నెలలో ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోయే సినిమాలు ఇవే..

లవ్ మీ:

బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించిన ఈ సినిమా.. హర్రర్ రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ లో మే 25వ తేదీన రిలీజ్ అయింది. ఆశిష్, వైష్ణవి చైతన్య ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో నటించారు. అరుణ్ భీమవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఆహా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి:

విశ్వక్‍సేన్, నేహాశెట్టి కలిసి నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ మే 31 న థియేటర్ లో రిలీజ్ అయింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత డీసెంట్ టాక్ అండ్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జూన్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీ లో ఈ సినిమా ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

భజే వాయివేగం:

కార్తికేయ హీరోగా నటించిన భజే ఈ సినిమా మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. థియేటర్ లో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. భజే వాయివేగం మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ దక్కించుకుంది. ఇక ఈ సినిమా కూడా ఇదే నెలలో ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది.

గంగం గణేశా:

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ గంగం గణేశా. ఈ సినిమా మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. టాక్ పరంగా బాగానే ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

యక్షిణి వెబ్ సిరీస్:

ఈ మధ్య కాలంలో ఓటీటీ లోకి ఓ తెలుగు వెబ్ సిరీస్ వచ్చి చాలా కాలం అయింది. దీనితో ఈ వెబ్ సిరీస్ పై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదల చేసిన ట్రైలర్ అందరికి ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి