iDreamPost

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రాకపోవడానికి అదే కారణం: ప్రశాంత్ లాయర్

పల్లవి ప్రశాంత్ కేసులో అతడికి బెయిల్ అప్లే చేసుకోలేకపోవడానికి ప్రధాన కారణం అదేనని చెప్పుకొచ్చారు ప్రశాంత్ లాయర్ రాజేశ్ కుమార్. మరి బెయిల్ కు అడ్డుపడుతున్న ఆ రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పల్లవి ప్రశాంత్ కేసులో అతడికి బెయిల్ అప్లే చేసుకోలేకపోవడానికి ప్రధాన కారణం అదేనని చెప్పుకొచ్చారు ప్రశాంత్ లాయర్ రాజేశ్ కుమార్. మరి బెయిల్ కు అడ్డుపడుతున్న ఆ రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రాకపోవడానికి అదే కారణం: ప్రశాంత్ లాయర్

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ విన్నింగ్ ర్యాలీలో ఆర్టీసీ బస్సు అద్దాలతో పాటుగా అమర్ దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా, అలాగే పల్లవి ప్రశాంత్ డ్రైవర్లను కూడా అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసును సుమోటోగా స్వీకరించిన పోలీసులు ఏ-1గా ప్రశాంత్ ను చేర్చారు. అతడి కోసం ప్రస్తుతం మూడు బృందాలు గాలిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ కేసుపై తాజాగా మీడియాతో మాట్లాడారు హైకోర్టు లాయర్ డాక్టర్ కే రాజేశ్ కుమార్. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రాకపోవడానికి కారణం అదేనని ఆయన చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ విన్నింగ్ నేపథ్యంలో ప్రశాంత్ ను అన్నపూర్ణ స్టూడియో ముందు గేట్ నుంచి రావొద్దని పోలీసులు చెప్పినా.. కూడా అతడు ఆ గేట్ నుంచే రావడంతో, అప్పటికే అక్కడికి భారీగా వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. ఈ సమయంలో ఆర్టీసీ బస్సు ధ్వంసం అయ్యింది. దీంతో పోలీసులు ఈ కేసును సుమోటోగా స్వీకరించారు. అయితే అతడిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారా? లేదా? అన్న విషయాలు ఏవీ ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తరపు లాయర్ డాక్టర్ రాజేశ్ కుమార్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రశాంత్ కు బెయిల్ రాకపోవడానికి కారణాలు పేర్కొన్నారు.

లాయర్ రాజేశ్ కుమార్ మాట్లాడుతూ..”పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అతడికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. దీంతో అతడు భయపడి పరారీలో ఉన్నాడు. FIR కాపీ ఇవ్వాల్సిందిగా పోలీసులను నేను అడగ్గా.. వారు ప్రశాంత్ తల్లిదండ్రులకు ఇస్తామని చెబుతున్నారు. అయితే సదరు ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. కానీ వారు అలా చేయడం లేదు. పోలీసులు ఆ కాపీని ఇవ్వకపోడంతో.. మేము బెయిల్ కు అప్లై చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఇక ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటి అనేది ఆ కాపీ చూస్తేనే తెలుస్తుంది” అని లాయర్ చెప్పుకొచ్చారు. కాగా.. ప్రశాంత్ తాను ఎక్కడికి వెళ్లలేదని, ఇక్కడే ఉన్నానని ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియో రిలీజ్ చేశాడు. మరి ఈ కేసు విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి