iDreamPost

మట్కాకి వరుణ్ జుట్టే ఆటంకం

ఇటీవలే మోగా ఫ్రీన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వేలంటైన్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడడంతో ఇప్పుడు వరుణ్ తదుపరి ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే తాజాాగా ఈ సినిమా పై వినిపిస్తున్న గాసిప్స్ కు దర్శకుడు ఓ లెటెస్ట్ అప్ డేట్ ని అందించాడు.

ఇటీవలే మోగా ఫ్రీన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వేలంటైన్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడడంతో ఇప్పుడు వరుణ్ తదుపరి ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే తాజాాగా ఈ సినిమా పై వినిపిస్తున్న గాసిప్స్ కు దర్శకుడు ఓ లెటెస్ట్ అప్ డేట్ ని అందించాడు.

మట్కాకి వరుణ్ జుట్టే ఆటంకం

ఒక్క డిజప్పాయంట్ మెంట్ ఏ హీరో కెరీర్ని అడ్డుకోలేదు. ఆపలేదు. ఆపరేషన్ వేలంటైన కొంత నిరాశపరిచిన మాట వాస్తవమే. కానీ ఈ ఒక్కటీ వరుణ్ కెరీర్ని నీరుగార్చలేదు. కానీ, సోషల్ మీడియా ఈ మధ్య ఆపరేషన్ వేలంటైన బాక్సాఫీసు దగ్గర బోల్తా పడగానే వరుణ్ తదుపరి చిత్రం మట్కా బడ్చెట్ తారుమారైందని, మార్కెట్ ట్రెండ్స్ మట్కా సినిమాని మటాష్ చేసేసిందని ఊకదంపుడుగా రాసిపారేసింది. లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక అన్నట్టుగా లోపల ఏం జరుగుతోందో ఎవ్వరికీ అక్కర్లేదు. కేవలం అంచనాలు, ఊహగానాలే సినిమా అనే ప్రక్రియని ఆవరించి, అతలాకుతలం చేస్తున్నాయి.

నిజానికి మట్కా చాలా సేఫ్ లో ఉంది. బడ్జెట్ బెడద లేనే లేదు. కావాల్సినంత పెట్టడానికి నిర్మాతలు గట్స్ తో ఉన్నారు. పేపర్ మీద వేసుకున్న బడ్జెట్ ఫిగర్స్ కాకుండా మరో పది నుంచి ఇరవై శాతం వరకూ అదనంగా అయినా కూడా ఫరవాలేదన్నట్టు స్టడీగా ఉన్నారు. దానికి కారణం దర్శకుడు కరుణ కుమార్ చెప్పిన కథ. చాలా డిఫరెంట్ పాయంట్ తో కరుణ రాసుకున్న కథ బట్టి బడ్జెట్ ప్రపోజల్ కూడా తయారయ్యాకనే నిర్మాతలు రంగంలోకి దిగారు. కథ ఆదారంగా బడ్జెట్లు తయారవుతాయిగానీ, బడ్జెట్ బేస్ తో ఏ కథ ఎప్పుడూ తయారవదని నిర్మాతలు కామెంట్ చేశారు. మట్కా డిలే అవుతోంది, దీనికి ఆపరేషన్ వేలంటైన్ సినిమానే కారణమని అనేక రకాలుగా విశ్లేషణలు వెలువడ్డాయి.

ముందు సినిమా కొంత దెబ్బ తిన్న తర్వాత బేరసారాలు కొంతవరకూ ప్రభావితమవుతాయన్నది నిజమే. దాని కారణంగా కథకి అవసరమైన బడ్జెట్లు తారుమారైపోవు. ఇదే విషయాన్ని దర్శకుడు కరుణ కన్ఫర్మ్ చేశాడు.’’ డిలే కాలేదు ప్రాజెక్టు. కొంత గ్యాప్ వచ్చింది. తీసుకున్నాం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. కాకపోతే ఆపరేషన్ వేలంటైన ప్యాచ్ వర్క్ ఫినిష్ చేయడానికి వరుణ్ హెయిర్ కట్ చేయించుకోవాల్సి వచ్చింది. మళ్ళీ హెయిర్ పెరగడానికి కొంత టైం కావాల్సివచ్చింది. అంతేగానీ కొందరు రాస్తున్నట్టుగా మట్కాకి బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. ప్రొడ్యూసర్స్ కూడా చాలా హేపీగా ఉన్నారు. మేం మూడో షెడ్యూల్ ప్రారంభించబోతున్నప్పుడు వేలంటైన్ టీం ప్యాచ్ వర్క్ కోసం వరుణ్ ని రిక్వెస్ట్ చేశారు. మళ్ళీ మట్కాలో గెటప్ కి సరిపోయినట్టుగా హెయిర్ మళ్ళీ పెరగాలి కదా. ఇదొక్కటే కొంతవరకూ కారణంగానీ, మరే ఇతర కారణాలు లేవు.’’ అని కరుణ కుమార్ చెప్పాడు. ప్రస్తుతానికి, వరుణ్ జుట్టే మట్కా షెడ్యూల్ ప్రారంభం కావడానికి కారణం గానీ, ఆపరేషన్ వేలంటైన్ సినిమా రిజల్టు కానే కాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి