iDreamPost

మొద్దు శ్రీను గుర్తున్నాడా? జైలు నుండి గొల్లపూడికి లెటర్! అతని మనుసు ఇంత సున్నితమా?

Moddu Seenu: మొద్దు శ్రీను.. తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ పై అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవిని హత్య చేసిన ఘటనలో నిందితుండిగా హత్యకు గురయ్యాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

Moddu Seenu: మొద్దు శ్రీను.. తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ పై అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవిని హత్య చేసిన ఘటనలో నిందితుండిగా హత్యకు గురయ్యాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

మొద్దు శ్రీను గుర్తున్నాడా? జైలు నుండి గొల్లపూడికి లెటర్! అతని మనుసు ఇంత సున్నితమా?

మొద్దు శ్రీను.. అలియాస్ జూలకంటి శ్రీనివాస్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ పై అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవిని హత్య చేసిన ఘటనలో నిందితుండిగా ఉన్నాడు. పరిటాల రవిని హతమార్చినది తానే అని స్వయంగా మొద్దు శ్రీనునే చెప్పాడు. తన బావ కళ్లలో ఆనందం చూసేందుకు ఈ పని చేశానని శ్రీను చెప్పుకొచ్చాడు. ఈ కేసులో లొంగిపోవడానికి ముందే ఓ మీడియా ఛానెల్ రిపోర్ట్ తో మొద్దు శీను మాట్లాడిన తీరు చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. అనంతరం విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తూ మొద్దు శ్రీను హత్యకు గురయ్యాడు. ఇన్నేళ్ల తరువాత ఆయన గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

2005లో పరిటాల రవిని చంపిన అనంతరం మొద్దు శ్రీను విశాఖపట్నం జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఇక 2008 నవంబర్ 9న మల్లెల ఓం ప్రకాశ్ అనే ఖైదీ.. డంబెల్ తో మొద్దు శ్రీను తలపై  బాది హత్య చేశాడు. అతడు కూడా విశాఖ జైల్లోశిక్ష అనుభవిస్తూ.. 2020లో  అనారోగ్య కారణంతో మరణించాడు. ఇది ఇలా ఉంటే.. ఈ బయట ప్రపంచానికి మొద్దు శీను కరుడుగట్టిన నేరస్థుడిగా మాత్రమే తెలుసు. కానీ అతడిలో మరో కోణం కూడా ఉందని తాజాగా ఓ వీడియోలో వెల్లడైంది.  మహిళలకు ఉండేంత సున్నితమైన మనస్సు మొద్దు శ్రీనుకు ఉందని ఓలేఖ ద్వారా బహిర్గతమైంది. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో మొద్దు శ్రీను.. ప్రముఖ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుకు రాసిన లేఖ ద్వారా తెలిసింది.  ఈ లేఖ విషయాన్ని ప్రముఖ ఎన్నారై కిరణ్ ప్రభ ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Moddu Seenu

మారుతీరావుకు రాసిన లేఖలో త్రిశూలం సినిమాలో మీరు జయసుధ జీవితం నాశనం చేయడాన్ని చూసి మీ బుర్ర బద్దలు కొట్టాలనిపించిందని, మీరు ఎక్కడ దొరుకుతారా అని చాలా రోజులు ఎదురు చూశానని మొద్దు శ్రీను లేఖలో పేర్కొన్నారు. అది సినిమా అని తెలిసినా కూడా గొల్లపూడి చేసిన పని తనకు నచ్చలేదని తెలిపాడు. ఎర్ర సీత నవల చదివానని, దాంట్లో ఎర్ర సీతను ఏడిపించిన తీరు.. మీ సాయంకాలమైంది నవలలో హృదయాలను కరిగించారని ఆయన రాశాడు. తనకు కూడా చిన్నతనం నుంచి ఎదుటి వాళ్లు బాధపడితే సాంత్వన కలిగించాలని ఉంటుందని, తన హృదయాన్ని కరిగించారని లేఖలో మొద్దు శ్రీను చెప్పుకొచ్చారు.

నక్సలైట్లు ఎందుకండీ ప్రపంచాన్ని మార్చడానికి.. గొల్లపూడి పుస్తకాలు చదివితే చాలని, ఆయన పుస్తకాలను ఉర్దూలో ట్రాన్స్‌లేట్ చేసి ఒసామా బిన్ లాడెన్‌తో చదివిస్తే ఆయన కూడా మారిపోతాడంటూ.. మొద్దు శ్రీను నాలుగు పేజీలు రాశాడు. “మీరెప్పుడైనా కనిపిస్తే కన్నీళ్లతో మీ పాదాలను కడగాలని ఉంది. మీ పర్మిషన్  లేకుండా మిమ్మల్ని గురువుగా భావించుకుంటోన్న మీ శిష్యుడు మొద్దు శీను’ అంటూ చర్లపల్లి జైల్లో ఉండగా..మొద్దు శ్రీను… గొల్లపూడి మారుతీరావుకు లేఖ రాశాడు. ఈ లేఖ గురించి తాజాగా ప్రముఖ ఎన్నైరై కిరణ్ ప్రభు వెల్లడించారు. మొత్తంగా తాను పెరిగిన వాతావరణం, తనకు ఎదురైన పరిస్థితుల వల్ల మొద్దు శీను ఓ హంతకుడిలా చరిత్రలో మిగిలిపోయాడు. కానీ అతడు కూడా ఓ మంచి మనసున్న, సున్నిత మనస్కుడేనని గొల్లపూడికి రాసిన లేఖను ద్వారా అర్థమవుతోంది. ఒక మనిషిలో ఇంత విరుద్ధమైన కోణాలు ఉండటం నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే అని  పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by coffee_conversations_music (@padmameenakshi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి