iDreamPost

కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్ట్.. ఎందుకంటే.?

బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాగా, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయ్యింది. ఇప్పుడు మరో నేత అరెస్టు అయ్యాడు.

బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాగా, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయ్యింది. ఇప్పుడు మరో నేత అరెస్టు అయ్యాడు.

కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్ట్.. ఎందుకంటే.?

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ముద్దుల తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టైన సంగతి విదితమే. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరో వైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ఆయనపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఇప్పుడు మరో బీఆర్ఎస్ నేతను అరెస్టు చేశారు పోలీసులు. మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అలియాస్ కల్వకుంట్ల తేజేశ్వర్ రావును పోలీసులు అరెస్టు చేశారు.

భూ కబ్జా కేసులో గతంలో అతడితో పాటు 35 మందిపై కేసు నమోదు కాగా, తాజాగా అతడిని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మండలం మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉన్న సర్వే ననెంబర్ 32లో రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు అండ్ గ్యాంగ్ ప్రయత్నించారని ఓఆర్ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గత నెలలో ఫిర్యాదు చేశారు. గత నెల 3వ తేదీన ఉదయం జేసీబీతో వచ్చి ఫెన్నింగ్ రాళ్లు తొలగించి.. హద్దు రాళ్లు పాతారని, అందులో ఉన్న గుడిసెను కన్నారావు గ్యాంగ్ నిప్పు పెట్టి కాల్చారని పేర్కొన్నారు. 150 మందితో వచ్చి బెదిరించినట్లు చెప్పారు. ఈ కంప్లయింట్ మేరకు ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కన్నారావుతో పాటు 36 మంది బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు అయ్యింది.

అయితే ఈ కేసు నమోదు కావడంతో అప్పటి నుండి వారంతా పరారీలో ఉన్నారు. కన్నారావు లోకేషన్ పరిశీలించగా.. బెంగళూరులో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ సీఎం అన్న కుమారుడైన కన్నారావుపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. ఎట్టకేలకు ఈ కేసులో కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం అతడు రెండుసార్లు ప్రయత్నించారు. బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో అతడిని ఆదిభట్ల పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు వరుసగా అరెస్టులు కావడంతో నేతల్లో ఆందోళన నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి