iDreamPost
android-app
ios-app

లాల్ సలామ్: షాకింగ్ న్యూస్ బయటపెట్టిన ఐశ్వర్య రజినీకాంత్!

  • Published Mar 12, 2024 | 3:00 PM Updated Updated Mar 12, 2024 | 3:00 PM

‘లాల్ సలామ్’ మూవీతో ఇటీవల మరోమారు ఆడియెన్స్​ను పలకరించారు ఐశ్వర్య రజినీకాంత్. ఆమె దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్​గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

‘లాల్ సలామ్’ మూవీతో ఇటీవల మరోమారు ఆడియెన్స్​ను పలకరించారు ఐశ్వర్య రజినీకాంత్. ఆమె దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్​గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

  • Published Mar 12, 2024 | 3:00 PMUpdated Mar 12, 2024 | 3:00 PM
లాల్ సలామ్: షాకింగ్ న్యూస్ బయటపెట్టిన ఐశ్వర్య రజినీకాంత్!

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఇచ్చిన స్టేట్ మెంట్స్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తను దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ సినిమా గురించి ఆమె చెబుతున్న విషయాలు ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ‘లాల్ సలామ్’ సినిమాకి సంబంధించిన 21 రోజుల షూటింగ్ ఫుటేజ్ మిస్ అయిందని చెప్పి అందరినీ విస్తుపోయేలా చేశారు ఐశ్వర్య రజినీకాంత్. ఆమె చెప్పిన మాటలు విన్న నెటిజన్లు రెండు రకాలుగా స్పందించారు. అసలు ఒక సినిమా కోసం రికార్డ్ చేసిన మూడు వారాల ఫుటేజ్ మిస్ అవడం ఎంటి? అలా అజాగ్రత్తగా ఎలా ఉన్నారని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు మాత్రం ఇదంతా అబద్ధం అని వాదిస్తున్నారు.

గత నెలలో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా ‘లాల్‌ సలామ్‌’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నానని దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్‌ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌లో 21 రోజుల పాటు కష్టపడి తీసిన ఫుటేజ్ అదృశ్యమయిందని అన్నారు. కాగా, అందుకు సంబందించిన హార్డ్ డ్రైవ్‌లు కూడా కనపడలేదట. 10 కెమెరాలతో 21 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్‌ను చిత్రీకరించారట. అయితే అంత కష్టపడి తీసిన ఫుటేజ్ మొత్తం మాయం అవడంతో ముఖ్యమైన సన్నివేశాలు లేకపోవడం వల్లే సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదని ఐశ్వర్య అన్నారు. నిజానికి మళ్ళీ షూట్ చేసేందుకు రజినీకాంత్, విష్ణు విశాల్ తదితరులు సిద్ధంగా ఉన్నా సమయం లేక, షూటింగ్ చేయలేకపోయాం అని అన్నారు.

ఐశ్వర్య రజినీకాంత్ చెప్పిన మాటలు నమ్మేలా లేవని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అసలు 21 రోజుల షూటింగ్ ఫుటేజ్ మాయమైపోవడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. మొదట అతిథి పాత్రగా అనుకున్న రజినీకాంత్ పాత్రను పెంచడం వల్లే సినిమా కథ మారిందని, అందుకే సినిమా ఫ్లాప్ అయిందని అన్న ఐశ్వర్య.. ఇప్పుడేమో షూటింగ్ ఫుటేజ్ మిస్ అయిందని చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మత సామరస్యం అనే కాన్సెప్ట్ కు తోడు క్రికెట్ బ్యాక్​డ్రాప్ తో తెరకెక్కిన ‘లాల్ సలామ్’ ఫిబ్రవరి 9న విడుదలై రజినీ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

‘లాల్ సలామ్’: ఐశ్వర్య రజినీకాంత్ షాకింగ్ స్టేట్​మెంట్

ఇదీ చదవండి: Gaami Movie: గామి బడ్జెట్ ఓన్లీ 6 కోట్లా?