కర్నూలు జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తాను దేవుడ్నంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. అంతటితో ఆగకుండా ఓ వింత కేసుపెట్టి.. పోలీసుల బుర్ర తిన్నాడు. అతడి ఫిర్యాదుతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్నూలు జిల్లా కోసిగి పోలీస్ స్టేషన్‌కు పండుగ రోజున ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి తన పేరు లక్ష్మీ నరసింహ స్వామిగా చెప్పాడు. తర్వాత తానో దేవుడ్ని అన్నాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ వ్యక్తి అంతటితో ఆగలేదు.
ఆంధ్రప్రదేశ్‌లలోని బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా తనదేనని, ఎవరో ఆ డబ్బును దొంగతనం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తనను ఎవరో చంపడానికి చూస్తున్నారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆ వ్యక్తి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
కష్టే ఫలి అన్న పదానికి పర్యాయ పదం ఆయన. ఏ రంగంలో అడుగుపెట్టిన తిరుగులేని విజేత ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మనస్థత్వం ఆయన.. ఇంతకు.. ఇంత ఎలివేషన్ ఎవరి గురించి అంటే ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్‌గా సంస్థకు ఎనలేని విజయాలను అందించారు రతన్ టాటా. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచిన, నిలుస్తూనే ఉన్న ఆయన మరోసారి తన మంచి మనస్సును […]