iDreamPost

రేవ్ పార్టీకి వెళ్ళా.. ఆ టైం దాటితే ఒంటి మీద బట్టలుండవు.. హేమపై కుర్చీ తాత కామెంట్స్

Kurchi Thatha On Hema Arrest: రేవ్ పార్టీలో ఎలా ఉంటారు? ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది? వంటి విషయాలను కుర్చీ తాత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలానే హేమ అరెస్ట్ పై కూడా స్పందించారు.

Kurchi Thatha On Hema Arrest: రేవ్ పార్టీలో ఎలా ఉంటారు? ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది? వంటి విషయాలను కుర్చీ తాత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలానే హేమ అరెస్ట్ పై కూడా స్పందించారు.

రేవ్ పార్టీకి వెళ్ళా.. ఆ టైం దాటితే ఒంటి మీద బట్టలుండవు.. హేమపై కుర్చీ తాత కామెంట్స్

కుర్చీ తాత అలియాస్ అహ్మద్ పాషా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కుర్చీ మడతపెట్టి డైలాగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో ఈ డైలాగ్ మీద ఏకంగా ఒక పాటకి స్టెప్పులు వేశారు. చిత్ర బృందం కూడా కుర్చీ తాతను కలవడం జరిగింది. ఆ తర్వాత కుర్చీ తాత మిస్సింగ్ అని వార్తలు రావడం.. ఇంట్లో వాళ్ళు కంగారు పడడం.. తాత వైజాగ్ సత్య అనే వ్యక్తి దగ్గర ఉండడం ఇవన్నీ చూసాం. అయితే అప్పటి వరకూ సోషల్ మీడియాలో హవా సృష్టించిన కుర్చీ తాత.. ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఇన్నాళ్లకు తెరపైకి వచ్చారు. తాజాగా హేమ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసుపై స్పందించారు.        

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్న కారణంగా బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  మొదట్లో ఆమెకు ఏ పాపం తెలియదని చెప్పినా ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ఆమెకు నోటీసులు పంపించారు. మొదటిసారి నోటీసులకు ఆమె రెస్పాండ్ కాకపోవడంతో మరోసారి నోటీసులు పంపించారు. అప్పటికీ స్పందించకపోవడంతో బెంగళూరు పోలీసులు హైదరాబాద్ లో ఆమె ఇంటిలోనే విచారించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెను బెంగళూరు పరప్పన అగ్రహర జైలుకు తరలించారు. ఇక హేమపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసినట్లు మంచు విష్ణు ప్రకటించారు.

హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే హేమ అరెస్ట్ పై, రేవ్ పార్టీపై కుర్చీ తాత స్పందించారు. తాను కూడా రేవ్ పార్టీకి రెండు సార్లు హాజరయ్యానని.. రాత్రి పదకొండున్నర దాటితే ఎవరి ఒంటి మీద బట్టలు ఉండవంటూ కామెంట్స్ చేశారు. ఆడతారు, పాడతారు.. డబ్బు కట్టలు జల్లుతా ఉంటారని అన్నారు. రేవ్ పార్టీకి వెళ్లి స్ప్రైట్ తాగుతూ.. సిగరెట్ కాలుస్తూ ఉన్నానని.. ఆ సమయంలో ఒక అమ్మాయి వచ్చి తనను డ్యాన్స్ చేద్దామని అడిగిందని.. భయంతో బయటకు వచ్చేసినట్లు కుర్చీ తాత పేర్కొన్నారు.

ఇక 50 లక్షలు పెట్టి రేవ్ పార్టీకి ఎవరూ వెళ్లరని.. కేవలం 500 ఎంట్రీ టికెట్ ఉంటుందని అన్నారు. 5 వేలు పడేస్తే గం*జాయి పొట్లం.. 50 వేలు పడేస్తే రెండు ఇంజక్షన్లు.. 50 లక్షలు ఎంట్రీ ఫీజు అనేది అబద్ధం అని కుర్చీ తాత వెల్లడించారు. ఇక హేమ గురించి మాట్లాడుతూ.. ఎవరి బతుకు వారిదని.. ఒకరిని విమర్శించే అధికారం మనకు లేదని.. సాధ్యమైనంత వరకూ సహాయం చేయాలని.. వేలెత్తి చూపించకూడదని కామెంట్స్ చేశారు. ఏ ఆడపిల్ల రోడ్డెక్కదని.. తల్లిదండ్రుల బలహీనత వల్లనో.. కట్టుకున్న భర్త బలహీనత వల్లనో ఆడపిల్ల రోడ్డెక్కుతుందని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి