iDreamPost

KCR కాళ్లు పట్టుకొని అయినా మంత్రి పదవి ఇప్పిస్తా: KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొండగల్  పర్యటనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే.. ప్రమోషన్ ఇప్పిస్తానని తెలిపారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొండగల్  పర్యటనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే.. ప్రమోషన్ ఇప్పిస్తానని తెలిపారు.

KCR కాళ్లు పట్టుకొని అయినా మంత్రి పదవి ఇప్పిస్తా: KTR

తెలంగాణలో ఎన్నికల వాతావరణం రసవత్తరంగా ఉంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య మాట వార్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అంతేకాక వివిధ పార్టీలకు చెందిన ప్రధాన నేతలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ రోజు ఆర్మూర్ లో జీవన్ రెడ్డి నామినేషన్లో పాల్గొన్ని.. అనంతరం కొండగల్ లో పర్యటించారు. కొండగల్  పర్యటనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే.. ప్రమోషన్ ఇప్పిస్తానని తెలిపారు.

బీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ ఈ రోజు ఆర్మూరు, కొండగల్ లో పర్యటించారు. ఆర్మూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ నేపథ్యంలో అక్కడ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో కొడంగల్ లోకి వెళ్లారు. కొండగల్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో కొండగల్ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ..జనంలో ఉండే వ్యక్తి.. ఎమ్మెల్యేగా కావాలా.. జైలుకు పోయే దొంగ కావాలా అని ప్రజలను అడిగారు. గత 11 సార్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినా కొడంగల్‌లో ఎన్నడూ  అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కొడంగల్‌లో నేతలను కొంటున్న రేవంత్‌.. ప్రజలను కొనలేడని పేర్కొన్నారు. రేవంత్‌ చేయలేని అభివృద్ధిని అయిదేళ్లలో పట్నం నరేందర్‌ రెడ్డి చేసి చూపెట్టారని కేటీఆర్ తెలిపారు.

కొండగల్‌లో మరోసారి పట్నం నరేందర్‌ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్‌ కళ్లు పట్టుకొని అయినా సరే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పిస్తానని కేటీఆర్‌ హామి ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గెలిచిన తరువాత  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీటిని అందిస్తామని వాగ్దానం చేశారు. కేసీఆర్‌కు సవాల్‌ విసురుతున్న రేవంత్‌ను చూస్తుంటూ.. తెగ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడ కొడుతున్నట్లు ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కొడంగల్ పేరును నాశనం చేశాడు. రేవంత్ రెడ్డికి కేసీఆర్‌ అక్కర్లేదు.. మా నరేందర్ రెడ్డి చాలని, ఇక్కడి ప్రజలను చూసి రేవంత్‌ 15వ తేదీన నామినేషన్‌ వెనక్కి తీసుకుంటాడని కేటీఆర్ పేర్కొన్నారు.

మీరు మాత్రం బ్యాలెట్ బాక్స్‌లో బీఆర్‌ఎస్‌కు గుద్దుడు గుద్దితే.. రేవంత్ రెడ్డి పారిపోవాలని ప్రజలను ఉద్దేశిస్తూ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు ఒకే ఒక్క గొంతు నొక్కేందుకు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ, ప్రధాని మోదీ, అమిత్‌ షా గుంపులు, గుంపులుగా వస్తున్నారని తెలిపారు. కరోనా కష్ట కాలంలో కూడా నరేందర్ రెడ్డి అందుబాటులో ఉన్నాడని, కానీ కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండని వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్‌ మండిపడ్డారు. మరి.. రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి