iDreamPost

మండుటెండల మధ్య కూల్ న్యూస్! ఈ తేదీ నుండి మనకి భారీ వర్షాలు!

తెలంగాణలో భానుడు ప్రతాాపాన్ని చూపుతున్నాడు. అడుగు తీసి బయటపెట్టలేని స్థితికి చేరుకుంటున్నారు ప్రజలు. మరో మూడు రోజుల పాటు ఇలానే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సమయంలో తీపి కబురు చెప్పింది ఐఎండీ

తెలంగాణలో భానుడు ప్రతాాపాన్ని చూపుతున్నాడు. అడుగు తీసి బయటపెట్టలేని స్థితికి చేరుకుంటున్నారు ప్రజలు. మరో మూడు రోజుల పాటు ఇలానే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సమయంలో తీపి కబురు చెప్పింది ఐఎండీ

మండుటెండల మధ్య కూల్ న్యూస్! ఈ తేదీ నుండి మనకి  భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా భానుడు భగ భగ మండిపోతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఉదయం 7 గంటలకు విధులకు హాజరవుతున్నాడు సూరీడు. ఉక్కపోత, హీట్ వేవ్స్ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. అడుగు తీసి బయటపెట్టలేని స్థితి. ఇటు ఏపీలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా టెంపరేచర్ గతం కన్నా పెరిగింది. హైదరాబాద్ నగరం కూడా నిప్పుల కుంపటిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను మించిపోతున్నాయి. మంచిర్యాల, పెద్ద పల్లి, జగిత్యాల, వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండల ధాటికి వడదెబ్బ తగిలి తెలంగాణలో నలుగురు మరణించారు. మరికొన్ని కూడా ఈ వేడిగాలులు వీస్తాయని తెలుస్తోంది.

ఇలాంటి సమయంలో ఓ తీపి కబురు అందుతోంది. వేడి గాలులతో ఉక్కిరి బిక్కిరి అయిపోయిన తెలంగాణ వాసులకు భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హీట్ వేవ్స్ తగ్గుతాయని తెలిపింది. మే 6 వరకు ఇలాగే ఉంటాయని, ఆ తర్వాత ఈ గణనీయమైన తగ్గుదల ఉంటుందని పేర్కొంది. మే 7 నుండి హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ చెబుతుంది. వచ్చే సోమవారం, మంగళవారం నుండి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురియవచ్చునని అంచనా వేస్తుంది. కాగా, మే 4, 5 తేదీల్లో కేరళ, దక్షిణ తమిళనాడు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా వానలు పడవచ్చునని తెలుస్తోంది. లేకున్నా వాతావరణం చల్లబడుతుందని చెబుతోంది. వర్షాలు పడిన దగ్గర నుండి హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతాయని ఐఎండీ అంచనా వేసింది.

అప్పటి వరకు, హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అయితే నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్ వంటి కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని తెలుపుతోంది. ఇక శుక్రవారం హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. కుత్బుల్లాపూర్‌లో 44.1 డిగ్రీలు, నాచారం, ముషీరాబాద్‌లో 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వేడి తీవ్రత పెరిగింది. మంచిర్యాలలోని హాజీపూర్ వంటి ప్రాంతాల్లో 46.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కరీంనగర్‌లోని వీణవంక, నల్గొండలోని ఇబ్రహీంపేట, సూర్యాపేటలోని మామిళ్లగూడెంలో కూడా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి