iDreamPost

బంగారం కొనుగోలుదారులకు ఇది బంపర్ ఛాన్స్..ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల పసిడి కొనుగోలు భారీగా పెరిగిపోవడంతో డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది.

Gold and Silver Rates: కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల పసిడి కొనుగోలు భారీగా పెరిగిపోవడంతో డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది.

బంగారం కొనుగోలుదారులకు ఇది బంపర్ ఛాన్స్..ఈ రోజు ఎంతంటే?

దేశ వ్యాప్తంగా కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.దేశంలో మహిళలు, పురుషులు పసిడి కి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. నేటి సమాజంలో బంగారం ఎంత ఎక్కువగా ఉంటే అంత గౌరవంగా ఉంటుందని మహిళలు భావిస్తున్నారు. ప్రత్యేక వేడుకలు, పెళ్లిళ్లు, వివాహాది శుభకార్యాలకు మహిళలు ధరలతో సంబంధం లేకుండా పసిడి కొనుగోలు చేస్తుంటారు. నిత్యం జ్యులరీ షాపులు కిట కిటలాడుతూనే ఉంటున్నాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టినా.. మళ్లి పెరిగిపోయాయి. ఈ రోజు బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం కొనుగోలు చేయానుకునేవారికి గుడ్ న్యూస్. మొన్నటి వరకు తగ్గిన పసిడి నిన్న అమాంతం పెరిగిపోయింది. మళ్లీ ఈ రోజు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్ లో కీలక మార్పుల కారణంగా పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం స్టాక్ మార్కెట్ లో భారీ పతనం ఉండగా.. బంగారం ధర కూడా పడిపోయింది. నేడు (మే4) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి రూ.71,720 కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి రూ.65,740కి చేరుకుంది. మార్కెట్ లో ప్రస్తుతం 1 గ్రాము ధర రూ. 6,574గా ఉంది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ పట్నం లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.71,720 కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై అదే స్థాయిలో తగ్గి రూ.65,740 వద్ద కొనసాగుతుంది.

Gold

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.540 తగ్గి రూ.71,870 కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై అదే స్థాయిలో తగ్గి రూ.65,890 కి చేరుకుంది. ముంబై, కోల్ కొతా, బెంగుళూరు లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.71,720 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,740 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,150 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,140 వద్ద కొనసాగుతుంది.తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 86,900 వద్ద ట్రెండ్ అవుతుంది. ఢిల్లీ, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.83,400వద్ద ఉండగా, చెన్నైలో కిలో వెండి ధర రూ..86,900వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి